Monday, 23 September 2019

Naga Babu: గెటప్ శ్రీనుని ఉపయోగించుకోకపోతే ఇండస్ట్రీకే నష్టం

ఎందరో కమెడియన్లకు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు కెరీర్‌ను అందించింది ప్రముఖ కామెడీ షో ‘జబర్దస్త్’. మెగా బ్రదర్ నాగబాబు, నటి రోజా ఈ షోకు జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అయితే జబర్దస్త్ స్టార్ కమెడియన్స్ అయిన సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనులు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘త్రీ మంకీస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ప్రెస్ మీట్‌లో భాగంగా నాగబాబు మాట్లాడారు. తనకు సుధీర్‌తో, రాంప్రసాద్‌తో, శ్రీనులతో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. ‘జబర్దస్త్‌లో ఎందరో టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. వారిలో నాకు బాగా ఇష్టమైనవారు సుధీర్, రాం ప్రసాద్, శ్రీను. రాంప్రసాద్‌లో ఓ గొప్ప రైటర్ ఉన్నాడు. అతను బాగా పంచ్‌లు రాస్తుంటాడు. రాంప్రసాద్ వేసే పంచ్‌లను మనం ఎవ్వరూ ఊహించలేం. రాంప్రసాద్ ఆటో పంచ్‌లు వేస్తాడని మేమంతా సరదాగా ఏడిపిస్తుంటాం కానీ ఓ హీరోకు ఉండాల్సిన అన్ని క్వాలిటీలు రాం ప్రసాద్‌కు ఉన్నాయి. రాంప్రసాద్‌ చాలా మంది రైటర్. ఇక గురించి చెప్పాలంటే నేను బాగా అభిమానించే వ్యక్తి ఎవరైనా జబర్దస్త్‌లో ఉన్నారంటే అది గెటప్ శ్రీను. ఎందుకు చెప్తున్నానంటే.. అతని గురించి పబ్లిక్‌లో చెప్పడానికి నాకు అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఏ భాషలోనైనా సరే.. అంతర్జాతీయ స్థాయిలో నటించగలిగే ఏకైక నటుడు గెటప్ శ్రీను. ఎంత గొప్ప నటుడంటే అతను ఇప్పటికీ 90 రకాల క్యారెక్టర్స్ చేశాడు. 90 రకాల డిక్షన్, బాడీ లాంగ్వేజెస్‌లో కామెడీ పండించాడు’ ‘ అది ఏ నటుడికీ సాధ్యం కాదు. ఎంతటి కష్టమైన టాస్క్ ఇచ్చిన ఇట్టే చేసేస్తాడు. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. నేను ఇంటర్నేషనల్ కామెడీ నుంచి పంజాబీ కామెడీ వరకు అన్నీ చూస్తాను. ఎంత మందిని చూసినా ఎవర్ని చూసినా శ్రీనుకు పోటీగా ఎవ్వరూ నటించలేరు అనిపించింది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో శ్రీనుకు రావాల్సిన గుర్తింపు ఎందుకు రాలేదో నాకు తెలీదు. అతను నాకు కొడుకు కాదు. మా మధ్య బంధుత్వం లేదు. జబర్దస్త్‌లో ఒక కమెడియన్ మాత్రమే. ఓ కొడుకుగా భావించి అతని గురించి ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్నవారికి తెలియాలి. శ్రీను గురించి ఒక్కటి మాత్రం చెప్పగలను. తెలుగు చిత్ర పరిశ్రమ అతన్ని ఉపయోగించుకోకపోతే మాత్రం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయిన వాళ్లమవుతాం. శ్రీనును ఉపయోగించుకోకపోతే అతను కోల్పోయేదేం ఉండదు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమకే నష్టం’ అంటూ శ్రీనును ఆకాశానికెత్తేశారు నాగబాబు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LGgj4a

No comments:

Post a Comment

Explained: SC's Property Judgment

'A rigid or overly broad interpretation could lead to a chilling effect on investments and growth in sectors traditionally driven by pri...