Saturday 21 September 2019

మోహన్‌లాల్ ఇంట్లో ఏనుగు దంతాలు.. కేసు నమోదు

ప్రముఖ మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్‌సై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడేళ్ల క్రితం అక్రమంగా ఏనుగు దంతాలను కొనుగోలు చేశారు. ఈ విషయం కాస్త అప్పుడే బయటికి రావడంతో చర్చనీయాంశంగా మారింది. విషయం ఐటీ అధికారుల వరకు వెళ్లడంతో 2012లో మోహన్‌లాల్ నివాసంలో రెయిడింగ్ చేశారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఉన్న మోహన్‌లాల్ నివాసంలో నాలుగు ఏనుగు దంతాలు లభ్యమయ్యాయి. అయితే ఏనుగు దంతాలు కొనుగోలు చేయడానికి మోహన్‌లాల్ వేరే వ్యక్తుల నుంచి స్పెషల్ లైసెన్స్‌ను తెచ్చుకున్నారు. కృష్ణకుమార్ అనే వ్యక్తి నుంచి తాను రూ.65వేలు పెట్టి ఆ దంతాలను కొనుగోలు చేసినట్లు మోహన్‌లాల్ ఐటీ అధికారులు తెలిపారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకోవడం శిక్షార్హమైన నేరం. అయితే 2012లోనే స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ మోహన్‌లాల్‌పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కేసును రద్దు చేశారు. అటవీ శాఖ చట్టానికి సంబంధించిన అంశాలలో సవరణలు చేసిన తర్వాత మోహన్‌లాల్ ఆ దంతాలను ఇంట్లోనే ఉంచుకోవచ్చని కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత ఓ సామాజికవేత్త మోహన్‌లాల్‌కు దంతాలను అమ్మిన వ్యక్తిపై కేరళ హైకోర్టులో కేసు వేశారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం సెక్షన్ 39 (3) కింద మోహన్‌లాల్‌కు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేకాదు మోహన్ లాల్‌పై చార్జ్‌షీట్‌ను నమోదు చేయడంలో ఆలస్యం చేసినందుకు అటవీ చర్యలు తీసుకుంటామని న్యాయస్థానం తెలిపింది. అయితే ఈ వివాదంపై మోహన్ లాల్ ఇప్పటివరకు స్పందించింది లేదు. దాదాపు 300లకుపైగా చిత్రాల్లో నటించిన గుర్తింపు తెచ్చుకున్న మోహన్‌లాల్‌కు 2018లో ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. గతేడాది ఆయన రాజకీయాల్లోకి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ రాజకీయాలు తనకు అంత సులువు కాదని సినిమాలతోనే తాను సంతోషంగా ఉన్నానని మోహన్‌లాల్ తెలిపారు. తాజాగా ఏనుగు దంతాల వివాదం మళ్లీ వెలుగులోకి రావడంతో పలువురు నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందరికో రోల్ మోడల్ అయిన మోహన్ లాలే ఇలాంటి పనులకు పాల్పడితే మిగతావారు ఏం నేర్చుకుంటారు? అని మండిపడుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2OfdE3g

No comments:

Post a Comment

Exclusive! The IPL Chairman Reveals All

'Whichever teams have the best players they get a chance to retain them.<br>'There is a lot of scope for new players to come i...