Monday 2 September 2019

‘సాహో’ నాలుగు రోజుల కలెక్షన్స్.. వినాయక చవితి కలిసిరాలేదు!

‘సాహో’.. ఈ సినిమాకి దక్కిన ప్రీ రిలీజ్ హైప్ వల్ల ‘బాహుబలి-2’కి మించి మార్కెటింగ్ జరిగింది. ఆ హైప్‌తోనే ఈ సినిమాకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగాయి. అందుకే సినిమా టాక్ ఎలా ఉన్నా సినిమా కలెక్షన్స్‌కు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. అంతే కాదు ‘బాహుబలి’ రెండు సినిమాలతో నార్త్ ఆడియన్స్ అంతా ప్రభాస్‌కి కనెక్ట్ అయిపోయారు. అందుకే ఈ సినిమా అక్కడ కూడా భారీగా వసూళ్లు రాబడుతుంది. ఓవరాల్‌గా సినిమా మొదటి మూడు రోజులకు గాను రూ. 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇందులో ఓవర్సీస్ కలెక్షన్ 8 మిలియన్ డాలర్లు అని చెబుతున్నారు. అయితే, మొదట మూడు రోజుల కలెక్షన్స్‌ని బేస్ చేసుకుని ఒక సినిమా ఫలితం ఏంటి అనేది చెప్పలేం. ‘సాహో’కి నాలుగో రోజు కూడా ఊహాతీతమయిన కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా కలెక్షన్స్‌లో డ్రాప్ కనిపించినప్పటికీ అవి మరీ అంత ఎక్కవగా లేవు. వినాయక చవితి సెలవు కూడా ‘సాహో’కి సానుకూలంగా మారింది. ఆ పండుగ ఎఫెక్ట్‌తో ‘సాహో’ టికెట్ కౌంటర్ కూడా పండుగ చేసుకుంది. దీంతో నాలుగు రోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ షేర్ 67 కోట్ల 35 లక్షల రూపాయలకు చేరింది. Also Read: తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ ఏకంగా రూ.188 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మరి మిగిలిన రన్‌తో ఆ అమౌంట్ రాబట్టడం అంటే అంత తేలికైన విషయం కాదు. ‘సాహో’కి అసలు టెస్ట్ ఇప్పుడే మొదలయ్యింది. మరోవైపు, బాలీవుడ్‌లో నాలుగో రోజు ‘సాహో’ కలెక్షన్లు కాస్త తగ్గిపోయాయి. సోమవారం బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద రూ. 14.20 కోట్ల గ్రాస్ వసూలైనట్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ‘సాహో’ హిందీ వర్షన్ ఓపెనింగ్ డే అంటే శుక్రవారం రూ.24.40 కోట్ల గ్రాస్ రాబట్టింది. శనివారం రూ.25.20 కోట్లు, ఆదివారం రూ.29.48 కోట్లు వసూలు చేసింది. కానీ, సోమవారం మాత్రం కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. మొత్తంగా హిందీ వర్షన్ నాలుగు రోజుల్లో రూ. 93.28 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34m9onV

No comments:

Post a Comment

'We Lost So Many Things In This War'

'The war ended in 2009 and I believe the new generation of Tamils don't know what was going on there.' from rediff Top Intervi...