Tuesday, 3 September 2019

టాలీవుడ్‌లో కొత్తస్టార్ 'చీప్ స్టార్'....ఎవరో మరి?

ఆర్‌ఎక్స్ 100 డైరెక్టర్ ఆ సినిమాలో ఒక రేంజ్‌లో బోల్డ్ సీన్స్ తీసి చిన్నసినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు. అయితే ఆ టైం లో ఆ సినిమాలో బోల్డ్ నెస్,లిప్ కిస్‌లు తప్ప వేరే ఏమీ లేవు అని మాట్లాడిన వాళ్ళకు మళ్ళీ నోరెత్తకుండా కౌంటర్స్ ఇచ్చాడు. అలాగే ఆ సినిమా గురించి,తెలుగు సినిమాల్లో మితిమీరుతున్న లిప్‌కిస్‌ల గురించి ఒక స్పెషల్ డిబేట్ పెడితే అందులో కూడా ఆ యాంకర్ ని దుమ్ముదులిపేసి ఆర్జీవీకి అసలు సిసలు శిష్యుడు అనిపించుకున్నాడు. అంతేకాదు ఆయన మనిషిగా చూస్తే ఆర్జీవీ నీచుడు అని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆర్ఎక్స్ 100 లాంటి హిట్ ఇచ్చి కూడా ఇప్పటికీ తన నెక్స్ట్ సినిమా ఓకే చేయించుకోలేకపోయిన అజయ్ భూపతి ఇప్పుడు చీప్ స్టార్ అంటూ పెట్టిన ఒక చిన్న ట్వీట్ చాలా పెద్ద దుమారం రేపుతోంది. ఆర్ఎక్స్ 100 తర్వాత మళ్ళీ అదే తరహా ఇంటెన్సిటీతో,వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో మహాసముద్రం అనే స్క్రిప్ట్ రాసుకుని చాలామంది చుట్టూ తిరిగాడు(తిరుగుతున్నాడు) అజయ్ భూపతి. రామ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్...ఇలా అనేక పేర్లు వినిపించాక దగ్గర ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఒక ప్రొడ్యూసర్ని కూడా సెట్ చేసాడు. అయితే ఆ సినిమా కథ నచ్చలేదో లేక డైరెక్టర్ తీరు నచ్చలేదో తెలియదు కానీ రవితేజ కారణం లేకుండా, ఓకే అని చెప్పకుండా ఆ ప్రాజెక్ట్ ని డిలే చేస్తూ వచ్చాడని, చివరికి అది క్యాన్సిల్ అయ్యిందని ఇండస్ట్రీలో బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. లైన్ ఓకే అని,సినిమా చేస్తా అని మాట ఇచ్చి,ఇంత కాలం తిప్పుకుని ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గా ఇరిటేట్ చెయ్యడంతో అజయ్ భూపతి అర్ధం చేసుకుని బయటకు వచ్చాడని టాక్. అయితే ఏమీ ప్రస్తావించకుండా,ఎవరి పేరు మెన్షన్ చెయ్యకుండా అజయ్ భూపతి పెట్టిన చీప్ స్టార్ అనే ట్వీట్ కి మహాసముద్రం క్యాన్సిలేషన్‌కి ఏమైనా సంబంధం ఉందా? అనే మాట ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. అయితే టాలీవుడ్ లో ఎవరిది తప్పయినా బడ్డింగ్ స్టేజ్‌లో ఉన్నవాళ్లు మాటతూలితే మాత్రం వాళ్లకి తలబిరుసు అనే ట్యాగ్ వేసేస్తారు. ఇప్పటికే అజయ్ భూపతి ఆ ట్యాగ్‌కి దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు ఈ చీప్ స్టార్ అనే ట్వీట్ అతని మంచి కంటే చెడే ఎక్కువ చేసేలా కనిపిస్తోంది. ఈ చీప్ స్టార్‌పై ఫుల్ క్లారిటీ వచ్చేవరకు మీడియా వర్గాలు కానీ, ప్రేక్షకులు కానీ దాన్ని వదిలేలా కనిపించట్లేదు. పైగా ఇప్పటికే అనేకమంది దగ్గరకి వెళ్లినా మహాసముద్రంలో ధైర్యం చేసి దూకే హీరోలు ఎవరు అనేది కూడా తేలాల్సి వుంది. అయితే ఈ స్క్రిప్ట్ గతంలో సమంతకి నెర్రేట్ చేసాడు.ఆమె కూడా ఆ సినిమా చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించింది. మరి ఆ ఇంప్రెషన్‌తో నాగచైతన్యను అప్రోచ్ అవుతున్నాడు అని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా మహాసముద్రం మొదలవ్వడానికే ముందే ఈ డైరెక్టర్‌ని ముప్పుతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్ళు తాగిస్తోంది అనేది మాత్రం నిజం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30TZpnZ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....