Wednesday 4 September 2019

సీన్లు లీక్ చేసిన వ్యక్తి.. ఫోన్ పగలగొట్టిన రాజమౌళి కుమారుడు

ఓ భారీ సినిమా తెరకెక్కుతున్నప్పుడు ఎలాంటి సన్నివేశాలు లీకవకుండా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటుంది చిత్రబృందం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎవరో ఒకరు సన్నివేశాలను రహస్యంగా ఫోన్ కెమెరాలో షూట్ చేసి లీక్ చేసేస్తుంటారు. అలాంటివారిని చూసినప్పుడు కోపం కట్టలు తెంచుకురావడంలో తప్పు లేదు. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకు ఇదే పరిస్థితి ఎదురైంది. అసలేం జరిగిందంటే.. సినిమా టీం బల్గేరియాకు వెళ్లకముందు కోకాపేట్‌లో భారీ సెట్‌ను ఏర్పాటుచేసి కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఆ సమయంలో ఓ వ్యక్తి సెట్‌లోకి చొరబడి కొన్ని సీన్లను తన ఫోన్ కెమెరాలో షూట్ చేశాడట. అది కాస్తా రాజమౌళి కుమారుడు కార్తికేయ కంటపడింది. అసలే భారీ తారాగణంతో భారీ బడ్జెట్‌తో తీస్తున్న సినిమా. ఇలాంటి పన్లు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా.. వెంటనే సదరు వ్యక్తి వద్ద ఉన్న ఫోన్ తీసి నేలకేసి కొట్టి పగలగొట్టారట. అసలైతే ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసి టీం కఠిన చర్యలు తీసుకునేదే. కానీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, తారక్ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్నారని రాజమౌళి ఎప్పుడో ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించారు. చిత్రీకరణ చాలా రోజులుగా జరుగుతోంది. అయినప్పటికీ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దాంతో అభిమానులు సినిమాలో ఏం ఉంటుందోనన్న ఆత్రుతతో ఉన్నారు. అందుకే ఇలా సన్నివేశాలను దొంగచాటుగా చిత్రీకరించడం వంటివి చేస్తున్నారు. నిర్మాతలు అన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రేక్షకుల కోసం భారీ సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు లీక్ చేయకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం బాధాకరం. ఇలాంటివారి గురించి ఆలోచించే ముందుజాగ్రత్తగా రాజమౌళి ఓ నిర్ణయానికి వచ్చారట. అక్టోబర్ 22న తారక్ పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేస్తే కనీసం అభిమానులు కాస్త సంతోషిస్తారని అనుకుంటున్నారట. బల్గేరియాలో ప్రస్తుతం తారక్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. చరణ్ తన పాత్ర కోసం రిహార్సల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. త్వరలో సెట్స్‌లోకి బాలీవుడ్ భామ ఆలియా భట్, బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్ అడుగుపెడతారు. సినిమా ఎలాంటి లీకుల బారిన పడకుండా ఉంటే వచ్చే ఏడాది జులై 30న సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు చక్కగా ఎంజాయ్ చేస్తారని, కక్కుర్తి పడి లీక్ చేయడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చిత్రవర్గాలు హెచ్చరిస్తున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LjkJ0I

No comments:

Post a Comment

'Preparing to enter affordable housing loans space'ns'

'Focus will be on smaller loan amounts to meet the needs of affordable homebuyers.' from rediff Top Interviews https://ift.tt/J1zq...