Sunday 22 September 2019

మెగాసంద్రమైన ఎల్బీ స్టేడియం.. రెగ్యులర్‌కు భిన్నంగా ‘సైరా’ వేడుక

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మెగా అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఆదివారం సాయంత్రానికికే ఎల్బీ స్టేడియం మెగాసంద్రమైంది. మైదానంతో పాటు స్టేడియంలో గ్యాలరీలన్నీ మెగా అభిమానులతో నిండిపోయాయి. అయినప్పటికీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. నగర నడిబొడ్డులో ఈవెంట్ జరుగుతున్నా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. Also Read: మరోవైపు, అన్ని ప్రీ రిలీజ్ వేడుకల మాదిగా కాకుండా ‘సైరా’ ఈవెంట్‌ను భిన్నంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎంటర్‌టైన్మెంట్ కార్యక్రమాలు భిన్నంగా ఏర్పాటుచేశారు. అన్ని ఈవెంట్లలోలా పాటలు పాడటం, డ్యాన్సులు వేయడం మాత్రమే కాకుండా ఢిఫరెంట్‌గా కల్చరల్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. ఉయ్ డ్యాన్స్ గ్రూప్, శ్రేకన్నా టీం వెరైటీ డ్యాన్స్ షో, నవాబ్ గ్యాంగ్ ర్యాప్ షో, ద ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ షో, విజయవాడకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి హాసిని చెప్పిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఇలా ఎన్నో ప్రత్యేకలు ‘సైరా’ వేడుకలో కనిపించాయి. వాస్తవానికి ‘సాహో’ ఈవెంట్‌ను కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా ఘనంగా నిర్వహించారు. కానీ, ఓపెన్ గ్రౌండ్‌లో అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసులకు చాలా కష్టమైంది. అలాగే, వినోదాత్మక కార్యక్రమాలు కూడా అంతగొప్పగా ఏమీలేవు. కానీ, ‘సైరా’ విషయంలో మాత్రం అలా జరగలేదు. చాలా జాగ్రత్తలు తీసుకుని, పగడ్బంధీగా ఏర్పాట్లు చేశారు. మెగా అభిమానులు జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా ఈ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరవుతోంది. మెగా కాంపౌండ్ నుంచి వెండితెరకు పరిచయమైన హీరోలంతా ఈ ఈవెంట్‌లో మెరనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నయ్య సినిమా గురించి మాట్లానుండటం మెగా అభిమానులకు మరీ ప్రత్యేకమైన విషయం. దర్శకధీరుడు రాజమౌళి, వి.వి.వినాయక్, సురేష్ బాబు, బీవీఎస్ఎన్ ప్రసాద్, శోభు యార్లగడ్డ ఇలా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది పెద్దలు ఈ వేడుకకు హాజరువుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30C010x

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...