మెగాస్టార్ చిరంజీవిపై ఆయన తమ్ముడు, జనసేన అధినేత, పవర్ స్టార్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తనను అతిథిగా ఆహ్వానించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అందరిలానే తాను కూడా చిరంజీవి అభిమానినని చెప్పారు. బయట తన పేరు ప్రతిష్టలు ఎలా ఉన్నా అన్నయ్య దగ్గరికి వచ్చేసరికి తానొక అభిమానిని అని చెప్పారు. తాను ఇంత మంది అభిమానులను సంపాదించుకున్నానంటే అది చిరంజీవి తనకు నేర్పించిన పాఠాలే అని అన్నారు. తన అన్నయ్య గొప్పతనాన్ని వివరిస్తూ తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని ప్రస్తావించారు. Also Read: ‘‘తెలంగాణలో చాలా మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. సరిగ్గా నేను కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను. ఇంటర్ ఫెయిల్ అయినందుకు మా అన్నయ్య పిస్టల్ తీసుకుని కాల్చేసుకుందాం అనుకున్నాను. నన్ను మా వదిన, రెండో అన్నయ్య చిరంజీవిగారి దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు ఆయన నాకు ఒక భరోసా ఇచ్చారు. నువ్వు జీవితంలో గెలవాలి తప్ప పరీక్షలో కాదన్నారు. ప్రతి పరీక్షను నేను కొలమానంగా చూడనురా అన్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫెయిల్యూర్ కాదు అని నాకు ధైర్యం ఇచ్చారు. అప్పుడు ఆయన ఇచ్చిన ధైర్యం, ఆ గుండె బలం ఈరోజు నన్ను మీ ముందు ఇలా నిలబెట్టాయి. అన్నయ్య లాంటి వ్యక్తులు ఆ కుటుంబాల్లో కూడా ఉండి ఉంటే ఆ పసిబిడ్డల ప్రాణాలు పోయేవి కాదు అని నాకు అనిపించింది. నాకు నిజంగా బాధ కలిగింది. చాలా మంది అన్నయ్య చెడును కోరుకున్నా.. ఆయన మాత్రం ఎదుటివాళ్ల బాగే కోరుకున్నారు. అంత మహనీయుడు నా అన్నయ్య. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం. కేవలం అన్నయ్యనే కాదు, ఒక మంచి వ్యక్తిగా ఆయనంటే నాకు గౌరవం’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2AFmCPe
No comments:
Post a Comment