Monday, 23 September 2019

‘సైరా’ టైటిల్ సాంగ్.. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన మరో ఆణిముత్యం

దుర్మార్గమైన ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించి ఆ పాలకులపై కత్తిదూసిన మొట్టమొదటి స్వాతంత్య్ర యోధుడు, రేనాటి సూరీడు, తెలుగు బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సినిమాగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘సైరా నరసింహారెడ్డి’గా వస్తోన్న ఈ సినిమాలో ఆ యోధుడి పాత్రను మెగాస్టార్ చిరంజీవి పోషించారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను ఆదివారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ పాటలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పతనాన్ని, శౌర్యాన్ని వివరించారు. ఈ పాటను దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు. అంటే, ఈ పాట స్థాయి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన మరో ఆణిముత్యం ఈ ‘సైరా’ టైటిల్ సాంగ్. Also Read: ఈ పాటలో సిరివెన్నెల వాడిన పదాలు చాలా గొప్పగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉన్నాయి. ఇంత అందమైన సాహిత్యాన్ని ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ అంతే గొప్పగా ఆలపించారు. అమిత్ త్రివేది స్వరపరిచిన ఈ పాట కేవలం మెగా అభిమానులనే కాదు.. ప్రతి ఒక్కరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. మరి అంతగొప్ప పాటను మీరు కూడా స్వయంగా మీ స్వరంతో ఆలపించాలనుకుంటే ఇక్కడ మేమందించే సాహిత్యంతో ప్రతయ్నించొచ్చు. పల్లవి పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవవురా ఉయ్యాలవాడ నారసింహుడా.. చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా రేనాటిసీమ కన్న సూర్యుడా మృత్యువే స్వరాన చిరాయురస్తు అనగా ప్రసూతి గండమే జయించినావురా నింగి శిరసువంచి నమోస్తు నీకు అనగా నవోదయానివై జనించినావురా హో సైరా.. హో సైరా.. హో సైరా.. ఉసస్సు నీకు ఊపిరాయెరా హో సైరా.. హో సైరా.. హో సైరా.. యసస్సు నీకు రూపమాయెరా చరణం 1 అహంకరించు ఆంగ్ల దొరలపైన హుంకరించగలుగు ధైర్యమా తలొంచి బతుకు సాటివారిలోన సాహసాన్ని నింపు శౌర్యమా శృంఖలాలనే తెంచుకొమ్మని స్వేచ్ఛ కోసమే శ్వాసనిమ్మని నినాదం నీవేరా ఒక్కొక్క బిందువల్లె జనులనొక్కచోట చేర్చి సముద్రమల్లె మార్చినావురా ప్రపంచమొనికిపోవు పెనుతుఫానులాగ వీచి దొరల్ని ధిక్కరించినావురా మొట్టమొదటి సారి స్వతంత్ర సమరభేరి పెఠిల్లు మన్నది ప్రజాలి పోరిది కాలరాత్రి వంటి పరాయి పాలనాన్ని దహించు జ్వాలలో ప్రకాశమే ఇది హో సైరా.. హో సైరా.. హో సైరా.. ఉసస్సు నీకు ఊపిరాయెరా హో సైరా.. హో సైరా.. హో సైరా.. యసస్సు నీకు రూపమాయెరా చరణం 2 దాస్యాన జీవించడం కన్న చావెంతో మేలంది నీ పౌరుషం మనుషులైతే మనం అనిచివేసే జులుం ఒప్పుకోకంది నీ ఉద్యమం ఆలని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్ని ఒదిలి సాగుదాం ఓ.. నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై అటేవేయని ప్రతి పదం కదనరంగమంతా కొదమసింగమల్లె ఆక్రమించి విక్రమించి తరుముతోందిరా అరివీర సంహారా హో సైరా.. హో సైరా.. హో సైరా.. హో సైరా.. హో సైరా.. హో సైరా.. ఉసస్సు నీకు ఊపిరాయెరా


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LLM6kl

No comments:

Post a Comment

'Please Save My Mum'

'Doctors feel they have a duty to prolong a heartbeat at all costs.' from rediff Top Interviews https://ift.tt/2TnvHrW