Monday, 2 September 2019

‘సాహో’ బాలీవుడ్ కలెక్షన్.. అక్షయ్, సల్మాన్‌లను బీట్ చేసిన ప్రభాస్

ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా, విమర్శకుల రివ్యూలు ఎలా ఉన్నా.. ‘సాహో’ మాత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు సాధ్యం కాని కలెక్షన్‌ను సౌత్ స్టార్ రాబట్టారు. ఈ ఏడాదిలో విడుదలైన తొలి ఆదివారం అత్యధిక కలెక్షన్‌ సాధించిన చిత్రంగా ‘సాహో’ హిందీ వర్షన్ నిలిచింది. తొలి ఆదివారం ‘సాహో’ ఏకంగా రూ.29.48 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తం మీద మూడు రోజుల్లో ‘సాహో’ హిందీ వర్షన్ రూ.79 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ ఏడాది విడుదలైన షాహిద్ కపూర్ సినిమా ‘కబీర్ సింగ్’ (రూ. 27.91 కోట్లు), అక్షయ్ కుమార్ చిత్రం ‘మిషన్ మంగళ్’ (రూ. 27.54 కోట్లు), సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘భారత్’ (రూ. 27.90 కోట్లు) మూడో రోజు వసూలు చేసిన దానికంటే కూడా ‘సాహో’ అత్యధికంగా కలెక్ట్ చేసింది. Also Read: ‘సాహో’ సినిమా బాగాలేదంటూ 1.5 రేటింగ్ ఇచ్చిన బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సైతం.. ఈ చిత్ర వసూళ్లు అదిరిపోయాయంటూ ట్వీట్లు చేశారు. ‘‘బాక్సాఫీసు వద్ద సాహో సెగలు పుట్టిస్తోంది. మూడో రోజు కలెక్షన్ బాగా పెరిగింది. మొదటి వారం ముగిసే సరికి నార్త్, ఈస్ట్ ఇండియాతో పాటు మిగిలిన సర్క్యూట్స్‌లోనూ అసాధారణంగా రాణిస్తోంది. ‘సాహో’ హిందీ వర్షన్ శుక్రవారం రూ. 24.40 కోట్లు, శనివారం రూ. 25.20 కోట్లు, ఆదివారం రూ. 29.48 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ. 79.08 కోట్ల గ్రాస్ వసూలు చేసింది’’ అని తరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, ఇప్పటి వరకు హిందీలో విడుదలైన ప్రభాస్ మూడు సినిమాల కలెక్షన్లలో పోలికను కూడా తరణ్ ఆదర్శ్ చూపించారు. 2015లో ‘బాహుబలి’ తొలివారాంతానికి రూ. 22.35 కోట్లు వసూలు చేయగా.. 2017లో ‘బాహుబలి 2’ ఏకంగా రూ. 128 కోట్లు రాబట్టిందని పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది ‘సాహో’ తొలివారాంతానికి రూ. 79.08 కోట్లు వసూలు చేసిందని ట్వీట్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2knP6Z3

No comments:

Post a Comment

What The Dhurandhar Girl Did Next

'The love I have received has been overwhelming.' from rediff Top Interviews https://ift.tt/1tJwmgl