Sunday 22 September 2019

సైరా: తమన్నా, కిచ్చా సుదీప్ సీన్స్.. కెవ్వు కేక

‘ఈగ’ సినిమాతో తన యాక్టింగ్ స్కిల్స్‌ను తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేశారు ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్. ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో అవుకు రాజు అనే పాత్రతో నటించారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్ఠా్త్మకమైన చిత్రమిది. ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలో తమన్నా, సుదీప్ పాత్రలకు సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. వారి పాత్రలను తీర్చిదిద్దిన విధానాన్ని వీడియోలో చూపించారు. ఇందులో తమన్నా.. చిరంజీవికి ప్రియురాలి పాత్రలో నటించారు. ఆయన భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార నటించారు. వీరితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, నిహారిక, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. సురేందర్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించారు. చిరంజీవి సినిమా అంటేనే మెగా అభిమానుల్లో ఏ రేంజ్‌లో ఉత్సాహం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఆయన కుమారుడు రామ్ చరణ్ తన సొంత నిర్మాణ సంస్థ పేరిట దాదాపు రూ.200 కోట్లు పెట్టి పీరియాడిక్ సినిమాను తీస్తే ఇంకేమన్నా ఉందా? బాక్సాఫీస్‌లు బద్ధలైపోవూ. సినిమాను మాత్రం చాలా గ్రాండ్‌గా తెరెకెక్కించారు. ప్రేక్షకులూ బాగా రిసీవ్ చేసుకుంటారని ట్రైలర్‌కు వచ్చిన వ్యూస్‌ను బట్టి అర్థమైపోయింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. అమిత్ త్రివేది సినిమాకు సంగీతం అందించారు. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సినిమా గురించి ఓ రేంజ్‌లో చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపైంది. అయితే స్టార్ నటీనటులతో, భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించినంతమాత్రాన 100 పర్సెంట్ సూపర్ హిట్ అయిపోతుందని చెప్పలేం. ఎందుకంటే హిందీలో విడుదలైన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘కళంక్’, మన తెలుగులో విడుదలైన ‘సాహో’ సినిమాల విషయంలో ఇది నిజమైంది. ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవి. కలెక్షన్స్ పరంగా బాగానే రాబట్టినా.. ప్రేక్షకులు ఆశించనంత స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ముఖ్యంగా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, కళంక్ సినిమాల గురించి చెప్పుకోవాలి. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ కా బాప్ అని జనాలు తేల్చేశారు. మరి విషయంలో ఏమవుతుందో తెలియాలంటే అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2AALKGG

No comments:

Post a Comment

'I Wanted To Make A Happy Film'

'I wanted people to know that women across all ages have an exciting life.' from rediff Top Interviews https://ift.tt/Ib7J0St