Tuesday, 3 September 2019

Azaan sami: పాకిస్థానే నా నివాసమంటున్న అద్నాన్ సమి కుమారుడు

పాకిస్థాన్‌లో పుట్టి భారత పౌరసత్వం దక్కించుకున్న హిందీతో పాటు తెలుగులోనూ ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. అయితే ఆయన కుమారుడు ఆజాన్ సమి మాత్రం పాకిస్థానే తన ఇల్లు అని అంటున్నారు. తన తండ్రి భారత పౌరసత్వం తీసుకోవడం గురించి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ‘నాకు నాన్నంటే ఎంతో గౌరవం. ఆయన భారత పౌరసత్వం తీసుకున్నారంటే అది ఆయన ఇష్టం. నేను ఈ విషయంలో కలగజేసుకోలేను. ఎక్కడ ఉండాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అన్న విషయంపై ఆయన కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. అదే విధంగా నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను అన్నది నా ఇష్టం. నాకు పాకిస్థానే ఇల్లు. నేను అక్కడే ఉండి పనిచేసుకోవాలని అనుకుంటున్నాను. అయితే భారతదేశంలో కూడా నాకు ఎందరో స్నేహితులు ఉన్నారు. నా టీనేజ్ మొత్తాన్ని నేను భారత్‌లోనే గడిపాను. అలాగని భారత్‌ను నా స్వస్థలం అని చెప్పలేను. ఒకవేళ పాక్‌కి భారత్‌కు మధ్య ఏవన్నా గొడవలు వస్తే నా చుట్టూ ఉన్న ప్రజలు రియాక్ట్ అయ్యే తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది’ ‘ఎందుకంటే మా నాన్న ఇండియాలోనే ఉంటున్నారు కాబట్టి. కొన్నిసార్లు నాకు ఎంతో మంది మెసేజ్‌లు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అసలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఇక నాన్నతో నేను ఎలాంటి రాజకీయ అంశాల గురించి ఎక్కువగా మాట్లాడను. ఒకవేళ మాట్లాడినా అది మా ఇద్దరి మధ్యే ఉండాలని అనుకుంటాను. నేను మా అమ్మ వద్దే ఎక్కువగా పెరిగాను. మా నాన్న నాకో ఫ్రెండ్ లాంటివారు. ఏదన్నా సలహా కావాలంటే నేను ఆయన వద్దకు వెళ్తాను. కొన్ని నెలల పాటు మేమిద్దరం మాట్లాడుకోకుండా ఉన్న సందర్భాలూ ఉన్నాయి. పిల్లలం కాబట్టి అది చేయండి ఇది చేయండి అని నేను నా తల్లిదండ్రులకు చెప్పలేను. సలహా ఇవ్వగలను కానీ ఏం చేయాలో చెప్పే అర్హత మాకు ఉండదు. నేనో మ్యూజిక్ కంపోజర్‌ని. నాన్నతో వర్క్‌కు సంబంధించి చాలా విషయాలు పంచుకుంటాను. నా మ్యూజిక్ ద్వారా మా నాన్న ఇన్‌ఫ్లుయెన్స్ పొందాలని ఎప్పుడూ అనుకోలేదు’ అని తెలిపారు. 1993లో సమి పాకిస్థానీ నటి జీబా బఖ్తైర్‌ని పెళ్లి చేసుకున్నారు. వీరి కుమారుడే ఆజాన్. వివాహమైన మూడేళ్లకే వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అద్నాన్ 2001లో భారత్‌కు వచ్చేశారు. 2001లో సమీ దుబాయ్‌కి చెందిన సబా గలాదారీ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. ఈ బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు. దాంతో సబా దుబాయ్ వెళ్లిపోయారు. అప్పటికే 230 కిలోల బరువున్న సమీ వ్యాయామం ద్వారా ఫిట్‌గా అవ్వాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలిసి సబా మళ్లీ ముంబయి వెళ్లి అద్నాన్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఏడాది తర్వాత సబా మళ్లీ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత 2010లో సమీ రోయా ఖాన్ అనే ఆర్మీ జనరల్ కుమార్తెను పెళ్లాడారు. వీరికి 2017లో పండంటి ఆడపిల్ల జన్మించింది. అప్పటి నుంచి సమీ తన కుటుంబంతో కలిసి భారత్‌లోనే నివసిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MTSGaa

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....