తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై అఘాయిత్యానికి ఒడిగట్టి పొట్టనపెట్టుకున్న ప్రవీణ్‌ను కఠినంగా శిక్షించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. మానవ మృగంలా మారిన కిరాతకుడి చేతిలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి శ్రీహితకు న్యాయం జరగాలని ఆ పసి పాపని చూసి రోదించని గుండె లేదు.. ఆ రాక్షసుడ్ని చంపేయాలని రగలని హృదయం లేదు. తెలంగాణ హన్మకొండలో జరిగిన ఈ దారుణ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విప్లవం మొదలైంది. జస్టిస్ ఫర్ అంటూ నెటిజన్లు నినదిస్తున్నారు. సామాన్య జనంతో పాటు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా శ్రీహితకు న్యాయం జరగాలని ఆ రాక్షసుడ్ని శిక్షించాలని కోరుతున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ శ్రీహితకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. హన్మకొండలో 9 నెలల చిన్నారి శ్రీహితకు అన్యాయం జరిగి రెండు రోజులైనా ఆమెకు సరైన న్యాయం జరగనందున న్యాయం పోరాటం చేస్తున్నానన్నారు కౌశల్. పోలీసుల నుండి కాని ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో ఆమరణ దీక్ష చేయబోతున్నానన్నారు కౌశల్. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన ఆమరణ నిరాహారదీక్షకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఆదివారం నాడు శ్రీహిత తల్లిదండ్రుల్ని కలుసుకుని.. అక్కడ నుండి మెజిస్ట్రేట్ ఎదురుగా ఆమరణదీక్ష చేయాలనుకున్నట్టు తెలిపారు. ఎవరైతే శ్రీహితకి న్యాయం కావాలని కోరుకుంటారో.. ఇలాంటి దారుణ సంఘటనలు ఇక ముందు జరగకూడదనుకుంటారో వారంతా ఈ నిరాహారదీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు కౌశల్. అయితే నిరాహారదీక్ష చేస్తున్నట్టు ముందుగా ప్రకటించిన కౌశల్.. సోషల్ మీడియాలో కొద్దిసేపటి క్రితం మరో వీడియో పోస్ట్ చేశారు. ‘తాము వరంగల్ వెళ్లి శ్రీహిత కుటుంబాన్ని కలుసుకున్నామని.. శ్రీహిత చనిపోయిన 11 రోజుల లోపే నిందితుడ్ని శిక్షిస్తాం అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి తమకు హామీ వచ్చిందని శ్రీహిత తండ్రి జగన్ తమకు తెలియజేసారని చెప్పారు. ఇక తాను చేపట్టిన నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేసి.. సోమవారం వరకూ సమయం కోరారన్నారు. అప్పటి వరకూ వేచి చూస్తాం’ అన్నారు కౌశల్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2FmtRhJ
No comments:
Post a Comment