Sunday 30 June 2019

ఇంత అన్యాయమా.. రామ్ చరణ్ ఆఫీసు ముందు ‘ఉయ్యాలవాడ’ వారి ధర్నా

రాయలసీమకు చెందిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వంశస్థులు హీరో రామ్ చరణ్ కార్యాలయం ముందు ఆదివారం ఆందోళనకు దిగారు. ‘సైరా’ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తమ వద్ద నుంచి తీసుకున్నారని, తమ పొలాల్లో షూటింగ్‌ చేసి వాటిని నాశనం చేశారని వారు ఆరోపించారు. తమను ఆదుకుంటామని రామ్ చరణ్ అప్పుడు మాటిచ్చారని.. కానీ, ఇప్పటి వరకు ఆర్థిక సాయం అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రామ్ చరణ్ తమను ఆదుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరుకున్నారు. ఉయ్యాలవాడ వంశానికి చెందిన ఒక మహిళ రామ్ చరణ్ ఆఫీసు ముందు మాట్లాడుతూ.. ‘ఉయ్యాలవాడ వచ్చి మా ఇండ్లలోకి దూరి షూటింగ్‌లు చేసుకున్నారు. ‘సైరా’ సెట్ అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశం కూడా మాదే. మా సొంత ప్రాపర్టీలో వీళ్లు సెట్ వేసుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన రోజు వీళ్లు ఎవరూ లేకపోయినా మేం వెళ్లాం. తిరుపతి ప్రసాద్ అనే వ్యక్తి చరణ్ బాబు మీకు న్యాయం చేస్తారని మాటిచ్చారు. నా భర్తను నన్ను తీసుకెళ్లి చరణ్ బాబుతో మాట్లాడించారు. మా దగ్గర ఆధారాలున్నాయి(ఫొటోలు). మమ్మల్ని తల్లిదండ్రులులా రిసీవ్ చేసుకున్నారు. చాలా సంతోషంగా మాట్లాడారు. న్యాయం చేస్తానన్నారు’ అని ఆమె వెల్లడించారు. అయితే, 30 రోజుల తరవాత తాము తిరుపతి ప్రసాద్‌కు ఫోన్ చేస్తే పరిహారం అడిగే హక్కు మీకులేదంటూ మాట దాటేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా ప్రాపర్టీలో ఆరబోసిన ధాన్యం, శనగలు, దనియాలు తొక్కకుంటూ పోయి షూటింగ్ చేశారు. ఇప్పుడు మేం ఇక్కడికొస్తే మా ప్రాపర్టీలో కూర్చోవద్దు అంటున్నారు. లీగల్‌గా మీకు హక్కులేదు అంటున్నారు. ఏంటి ఈ అన్యాయం. కోట్ల బిజినెస్ చేసుకుంటున్నారు. మా రక్తం అది. మా బంధం అది’ అంటూ ఆమె ఆవేశంగా మాట్లాడారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపేశారు. కాగా, చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో ‘సైరా’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XGp8lg

No comments:

Post a Comment

'Trump Will Back India On Pakistan'

'Trump will absolutely back New Delhi on its position that Pakistan must do more to crack down on terrorists that threaten India.' ...