Thursday 27 June 2019

‘బ్రోచేవారెవరురా’: పొట్టచెక్కలవ్వాల్సిందే.. నాని ఫస్ట్ రివ్యూ

వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోన్న చిన్న హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. ఆయన ప్రతి సినిమా ఒక కొత్త కథాంశమే.. ఒక ప్రయోగమే. ఈసారి కూడా డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీవిష్ణు హీరోగా ‘మెంటల్‌ మదిలో’ ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ట్యాగ్‌ లైన్‌. మన్యం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కుమార్‌ మన్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్‌గా నటించారు. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, సత్యదేవ్‌, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా చిన్నదే అయినా దీనికి కల్పించిన ప్రచారంతో ప్రేక్షకుల్లో్ అంచనాలు పెరిగాయి. దీనికి తోడు మంచి తారాగణం తోడవడంతో ప్రేక్షకుల దృష్ణి ఈ సినిమాపై పడింది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘నేను కేవ‌లం ఆడ‌పిల్లల కోసం ఈ సినిమా చేశా. ప్రతి అమ్మాయి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. అదేంట‌న్నది సినిమాలో చూడండి. న‌వ్వులు కూడా చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. ఏడుపుగొట్టు సినిమా కాదు’ అని వెల్లడించారు. ఆయన చెప్పినట్టుగానే తాజాగా ఈ సినిమా గురించి నేచురల్ స్టార్ కూడా చెప్పారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడి పొట్టచెక్కలవడం ఖాయమట. ‘బ్రోచేవారెవరురా’ విడుదలకు ఒకరోజు ముందు అంటే గురువారం నాడు నాని ఈ సినిమాను చూశారు. చూసిన తరవాత తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘ఇప్పుడే ‘బ్రోచేవారెవరురా’ చూశాను. కచ్చితంగా విపరీతంగా నవ్విస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి కామెడీ రాలేదు. విష్ణు, నివి, సత్య, నివేతా పేతురాజ్, రాహుల్, దర్శి అందరూ అద్భుతంగా చేశారు. డైరెక్షన్, మ్యూజిక్‌తో ఇద్దరు వివేక్‌లు అదరగొట్టారు. రేపు విడుదలవుతోంది. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని తన ట్వీట్‌లో నాని పేర్కొన్నారు. కాగా, యూఎస్‌లో ఈ సినిమా ప్రీమియర్లు వేస్తున్నారు. మరికాసేపట్లో టాక్ ఏంటో తెలిసిపోతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FEp3nV

No comments:

Post a Comment

'Trump Will Back India On Pakistan'

'Trump will absolutely back New Delhi on its position that Pakistan must do more to crack down on terrorists that threaten India.' ...