Saturday, 29 June 2019

బిగ్‌బాస్ కాన్సెప్ట్ నచ్చదు.. బ్యాడ్‌గా మాట్లాడతా, నాగార్జున కామెంట్స్ వైరల్!

‘బిగ్‌బాస్ 3’ తెలుగు హోస్ట్ ఎవరేనది ఎట్టకేలకు తెలిసిపోయింది. ప్రముఖ నటుడు, నిర్మాత అక్కినేని ఈ షో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రోమో కూడా విడుదలైంది. అయితే, ఈ షో మొదలుకాక ముందే నాగార్జునపై ట్రోల్స్, జోకులు మొదలయ్యాయి. ఇందుకు కారణం.. గతంలో ఆయన ‘బిగ్‌బాస్‌’ షోపై చేసిన వ్యాఖ్యలే. హోస్ట్‌గా నాగార్జున పేరు వెలువడగానే.. నెటిజనులు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోతో ట్రోల్ చేస్తున్నారు. బిగ్‌బాస్ 2 తెలుగు హోస్ట్ నానితో కలిసి నటించిన ‘దేవదాసు’ సినిమా విడుదల సందర్భంగా నాగ్ ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘బిగ్‌బాస్ షో గురించి అడగొద్దు. నేను బ్యాడ్‌గా మాట్లాడతా. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చదు. అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడో తొంగిచూడటం నచ్చదు’’ అని చెప్పారు. ఆ వ్యాఖ్యల వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ చస్తున్నారు. ఆయన ఏదైతే ఇష్టపడడో అదే షోను హోస్ట్ చేయాల్సి వస్తుందని, దీన్నే కర్మ అంటారని కొందరు వ్యాఖ్యానిస్తుంటే, ఇంకొందరు వద్దనుకున్న షోనే ఆయన చేయాల్సి వస్తోందని అంటున్నారు. అయితే, నాగ్ అభిమానులు మాత్రం అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, ఆయన ఓ కళాకారుడిగా తన వృత్తిధర్మాన్ని పాటిస్తున్నారని తెలుపుతున్నారు. ఏది ఏమైనా నాగ్.. షో మొదలు కాకముందే ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నారు. జూలై నెలలో మొదలు కానున్న ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ‘మీలో ఎవరు కోటేశ్వరుడు’ షోతో నాగార్జున ఇప్పటికే బుల్లితెర అభిమానులను సొంతం చేసుకున్నారు. దీంతో ‘బిగ్‌బాస్’ షోను సమర్థంగా నిర్వహిస్తారని భావిస్తున్నారు. అయితే.. ఆ షోకు, బిగ్‌బాస్‌కు చాలా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో ఆయన హౌస్ సభ్యులను ఎలా ట్రీట్ చేస్తారనే ఆసక్తి నెలకొంది. గతంలో బిగ్‌బాస్-2 హోస్ట్‌గా వ్యవహరించిన నాని.. చాలా పెద్ద బాధ్యతనే నెత్తిన వేసుకున్నట్లు ప్రేక్షకులు భావించారు. ముఖ్యంగా కౌశల్ ఆర్మీ రూపంలో నాని ఎన్నో విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. మరి, నాగార్జునకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JcCMTT

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....