Sunday 30 June 2019

‘నిను వీడని నీడను నేనే’ ట్రైలర్.. సందీప్ కిషన్ అద్దంలో వెన్నెల కిషోర్‌లా!

ఇప్పటి వరకు హీరోగా సత్తాచాటిన ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. విస్తా డ్రీమ్ మర్చంట్స్‌తో కలిసి సందీప్ కిషన్ నిర్మాణ సంస్థ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, వి స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దయా పన్నెం, విజి సుబ్రహ్మణ్యన్, సందీప్ కిషన్ నిర్మాతలు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ కథానాయికగా నటించింది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇవి చాలా రొమాంటిక్‌గా ఉన్నాయి. కానీ, తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మాత్రం భయపెడుతోంది. ‘400 సంవత్సరాల క్రితం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో ఓ చిన్నపిల్లవాడికి అద్దంలో ఒక పెద్దాయన రూపం కనిపించింది. ఆ ఊరివాళ్లు భయంతో ఆ పిల్లవాడిని చంపేశారు. చదివిన విషయాన్ని ఇప్పుడు నేరుగా చూస్తూన్నాను’ అంటూ చర్చి ఫాదర్ హీరోయిన్‌తో చెప్పడంతో సినిమా స్టోరీ లైన్ ఏంటో అర్థమైంది. సందీప్ కిషన్ అద్దంలో చూసుకున్నప్పుడు అతని రూపం వెన్నెల కిషోర్‌లా కనిపిస్తోంది. ఇదే అతని లోపం. ఇలాంటి క్లిష్టమైన స్టోరీలైన్‌తో స్క్రిప్టును ఎలా తీర్చిదిద్దారు, స్క్రీన్‌ప్లే ఎలా ఉండబోతోంది అనేవి ఆసక్తికరం. సినిమా చూస్తుంటే రొమాన్స్, కామెడీ, యాక్షన్‌కు లోటు ఉండదని అర్థమవుతోంది. చూద్దాం రేపు తెరమీద సందీప్ కిషణ్ ఏ మాయ చేయబోతున్నారో! ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FIspWX

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz