Sunday, 30 June 2019

పాలకొల్లులో ‘జనసేన’ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్.. ఇప్పటికే అన్నీ సిద్ధం

సినీ హీరోగా టాలీవుడ్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించడంతో పాటు కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న పవర్ స్టార్ వాటన్నిటినీ వదిలి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీకి దిగారు. కానీ, హీరోగా పవన్‌ను ఆదరించిన ప్రజలు నాయకుడిగా మాత్రం ఎన్నుకోలేదు. అయినప్పటికీ తన జీవితం ప్రజాసేవకే అంకితం అని పవన్ చెప్పకనే చెప్పారు. ఓడినా గెలిచినా తాను ప్రజలకు అండగానే ఉంటానని అంటున్నారు. ఓ వైపు రాజకీయాలు చూసుకుంటూనే ఔత్సాహిక యువత కోసం ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభిస్తున్నారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న మాజీ మంత్రి హరిరామ జోగయ్యను ఆదివారం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే, ఈ సందర్భంగా పాలకొల్లులో జనసేన ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు హరిరామ జోగయ్య చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దర్శకుడు రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్‌గా ఉంటారు. నిర్మాత బన్నీ వాసు ఇన్‌స్టిట్యూట్ కార్యకలాపాలు చూసుకుంటారు. ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పాలకొల్లు నుంచి ఎందరో వచ్చారు. అల్లు రామలింగయ్య గారు, దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు.. ఇలా చాలామంది పాలకొల్లు నుంచి వచ్చినవారే. నవతరంలో ఉన్న నైపుణ్యాన్ని తీర్చిదిద్దేలా పాలకొల్లులో శ్రీ ఎస్‌.వి.రంగారావు ఫిల్మ్‌ ఇన్ఫిట్యూట్‌‌ను జనసేన అధ్వర్యంలో నెలకొల్పనున్నాం. ఈ ఇన్ఫిట్యూట్‌ కి హరిరామ జోగయ్య గారు చైర్మన్‌‌గా వ్యవహరిస్తారు. వీరు నిర్మాతగాను ఎన్నో మంచి చిత్రాలు అందించారు. రాజా వన్నెంరెడ్డి, బన్నీ వాసు నేతృత్వంలో నడుస్తుంది. ఇందుకు నా అండదండలు ఉంటాయి. ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల యువతకు ఉపయోగపడేలా ఉంటుంది’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. హరిరామ జోగయ్య మాట్లాడుతూ.. ‘చిరంజీవిగారి కుటుంబం అంటే ఎంతో ఇష్టం. పవన్‌ కల్యాణ్‌ గారికి అభిమానిని. జనసేన పార్టీకి ఎప్పుడూ నా సహాయసహకారాలు ఉంటాయి. చివరి శ్వాస వరకూ జనసేన కోసమే పని చేస్తాను. ప్రజలందరి క్షేమం కోరుకొంటూ అందరినీ సురక్షితంగా చూసుకొనే పార్టీ ఇది. అందరం పవన్‌ కల్యాణ్‌ గారి వెన్నంటి నడుద్దాం. పాలకొల్లు ఫిల్మ్‌ ఇన్నిట్యూట్‌‌లో నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ ఇస్తాం. రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్‌‌గా వ్యవహరిస్తారు. శిక్షణ విధానం, ఫ్యాకల్టీ సిద్ధం అయింది. ఈ శిక్షణాలయం ప్రారంభానికి పవన్‌ కల్యాణ్‌ వస్తారు’ అని చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2IZW8gn

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...