ప్రస్తుత బిజీ లైఫ్‌లో మన బంధువులు, స్నేహితులతో సమయం గడపలేకపోతున్నాం అనే బాధ చాలా మందిలో ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, పిల్లల బాధ్యతలు.. ఇలా మన బిజీ లైఫ్‌కు చాలా కారణాలే ఉంటాయి. ప్రస్తుతం ఇల్లు, పిల్లలు తప్ప పక్కోడి గురించి ఆలోచించే సమయం చాలా మందికి ఉండటం లేదు. మన పరిస్థితే ఇలా ఉంటే పొద్దున్న మొదలుకొని అర్ధరాత్రి వరకూ షూటింగ్‌లతో బిజీగా ఉండే హీరోల సంగతేంటి. ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితి వాళ్లది. మెగా ఫ్యామిలీలోనూ ఇదే పరిస్థితి. రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ వీళ్లంతా రోజూ కలుసుకుని ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకునే అవకాశం ఉండదు. ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు మాట్లాడుకోవడం తప్ప. అందుకే, మెగా కజిన్స్ అందరినీ ఒక చోటికి తీసుకురావడానికి తన ఇంట్లో కంబైన్డ్ లంచ్ ఏర్పాటు చేశారు. ఈ లంచ్‌లో రామ్ చరణ్, వరుణ్ తేజ్, కళ్యాణ్ దేవ్, నిహారిక, శ్రీజ, సుష్మిత తదితరులు పాల్గొన్నారు. కొణిదెల ఫ్యామిలీకి చెందిన కజిన్స్ మాత్రమే ఈ లంచ్‌లో పాల్గొన్నారు. అయితే, చరణ్ భార్య ఉపాసన హాజరుకాలేదు. అలాగే అల్లు ఫ్యామిలీ కూడా పాల్గొనలేదు. లంచ్ సందర్భంగా తేజూ ఇంట్లో తీసుకున్న ఫొటోలను ఆయనతో పాటు కళ్యాణ్ దేవ్, ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మెగా కజిన్స్ అందరినీ ఒకే చోట చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2N6HojB
No comments:
Post a Comment