స్టైలిష్ స్టార్ , సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి ‘రేసుగుర్రం’ కాగా.. మరొకటి ‘సరైనోడు’. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. తమన్ ఇచ్చిన పాటలు, నేపథ్య సంగీతానికి కూడా మంచి పేరొచ్చింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మూడో చిత్రం వస్తోంది. దీన్ని కూడా హిట్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమా ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది అల్లు అర్జున్‌కు 19వ సినిమా. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలు. ఈ సినిమాకు ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. ప్రముఖ బాలీవుడ్ నటి టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కూడా ఓ పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ విషయాన్ని తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. త్రివిక్రమ్, బన్నీతో కలిసి తీసుకున్న ఫొటోను కూడా షేర్ చేశారు. ‘మాస్టర్ ఆఫ్ రైటింగ్ త్రివిక్రమ్ సార్, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి మ్యూజిక్ ప్రక్రియను కొనసాగిస్తున్నాం’ అంటూ తమన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి గతంలో త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే, ‘అరవింద సమేత’ సినిమాకు త్రివిక్రమ్ తమన్‌ను తీసుకున్నారు. ఆ సినిమాలో తమన్ పనితనం నచ్చి ఇప్పుడు మళ్లీ ఇంకో అవకాశం ఇచ్చారు. దీంతో బన్నీతో మూడోసారి పనిచేసే అవకాశం తమన్‌కు దక్కింది. చూద్దాం ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఏ స్థాయిలో ఉంటుందో!
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2XvzgNC
No comments:
Post a Comment