సుదీర్ఘకాలం పాటు హీరోయిన్‌గా హీరోలకు ధీటుగా నిలబడిన లేడీ సూపర్ స్టార్ లాంగ్ గ్యాప్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు అప్ కమింగ్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు విజయశాంతి. రేపు (జూన్ 24) విజయశాంతి పుట్టినరోజు కావడంతో మీడియా ముచ్చటించారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తాను ఇంతవరకూ ఎందుకు పిల్లల్ని కనలేదో చెప్పారు విజయశాంతి. శ్రీనివాస ప్రసాద్ అనే వ్యక్తిని వివాహమాడిన విజయశాంతి కావాలనే పిల్లల్ని కనలేదన్నారు. ప్రజాసేవకు తన జీవితం అంకింతం చేయాలనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నానన్నారామె. 17 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయానని.. ఆ విషాదం నుండి కోలుకోకముందే తండ్రి చనిపోయిన ఏడాది తరువాత తన తల్లి కూడా చనిపోవడంతో ఒంటరి అయ్యానన్నారు. ఆ సందర్భంలో తనకు తోడుగా ఉన్నది తన భర్త, నిర్మాత శ్రీనివాస ప్రసాద్ అన్నారు. ఆపదలో తోడుగా నిలిచిన శ్రీనివాస ప్రసాద్‌ని 1988, మార్చి 29న రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నానన్నారు విజయశాంతి. అయితే తమ ఇద్దరికీ పిల్లలంటే ఇష్టం ఉన్నప్పటికీ పిల్లల్ని కనాలనిపించలేదన్నారు. సినిమాలతో పాటు రాజకీయంగా బిజీ కావడంతో పాటు పిల్లల్ని కంటే వాళ్ల గురించి స్వార్ధం పెరిగిపోతుందని.. పూర్తి సమయాన్ని ప్రజలకు కేటాయించలేమన్న కారణంతో పిల్లల్ని కనాలనిపించలేదన్నారు. తమకు పిల్లలు లేకపోయినా ప్రజలే తమ పిల్లలు అన్నారు విజయశాంతి. విజయశాంతి పొలిటికల్ జర్నీ.. తొలిత బీజేపీతో కలిసి పనిచేసిన విజయశాంతి.. ఆ తరువాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. అనంతరం మెదక్ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. తరువాత కేసీఆర్‌తో పొసగక పోవడంతో టీఆర్‌ఎస్ నుండి బయటకు వచ్చేసి హస్తానికి చేయి అందించి కాంగ్రెస్‌లో చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా కొనసాగుతున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2KBuKXU
No comments:
Post a Comment