Tuesday 20 July 2021

HBD Upasana: భార్యపై ప్రేమ కురిపించిన చెర్రీ.. మధ్యలో దూరిన మంచు లక్ష్మి.. ఆ మాటతో మళ్ళీ దొరికేసింది!

నేడు (జులై 20) మెగా కోడలు, సతీమణి . భార్యపై ఎంతో ప్రేమగా ఉండే చెర్రీ.. ఈ ప్రత్యేకమైన రోజున ఆమెకు స్పెషల్ విషెస్ పోస్ట్ చేశారు. తన అర్ధాంగిపై ఉన్న అమితమైన ప్రేమను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో సందేశం పెట్టారు. ఈ మేరకు ఉపాసనతో దిగిన ఓ పిక్ షేర్ చేశారు రామ్ చరణ్. ఇంతవరకూ ఒకే గానీ ఈ దంపతుల మధ్యలో దూరి ఓ కామెంట్ వదిలింది . ''నీ కుటుంబం కోసం, అలాగే అవసరం ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఏదైనా చేయడానికి నువ్వెప్పుడూ ముందుంటావు. అలాంటి నీకు కృతజ్ఞత చెప్పడానికి ఎంత పెద్ద బహుమతి ఇచ్చినా అది చిన్నదే అవుతుంది. హ్యాపీ బర్త్‌డే. లవ్ యూ'' అని పోస్ట్ పెడుతూ భార్య తన భుజంపై వాలి ఉన్న ఓ ఫొటో షేర్ చేశారు రామ్ చరణ్. అయితే దీనిపై రిప్లై ఇచ్చిన ఉపాసన.. ''మిస్టర్ సీ.. ఎప్పుడూ నా వెన్నంటి ఉంటూ అన్నింటా సపోర్ట్ ఇస్తున్నావ్. థాంక్యూ'' అని పేర్కొంది. ఇక ఈ పోస్ట్ చూసిన మంచు లక్ష్మి.. 'ఈ పిక్ తీసినందుకు నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు' అని కామెంట్ చేయడం విశేషం. మంచు లక్ష్మి, మధ్య మంచి స్నేహ బంధం ఉంది. ఫ్యామిలీ పార్టీస్‌లో చెర్రీ దంపతులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటుంది మంచు లక్ష్మి. అలా ఏదో పార్టీలో ఇలా చెర్రీ దంపతులను ఫొటో తీసి ఉంటుంది ఈ మంచు వారమ్మాయి. అందుకే ముందు తనకే థ్యాంక్స్ చెప్పాలని అడుగుతోంది. కాకపోతే ఇక్కడ ఉపాసను బర్త్ డే విష్ చేయకుండా థ్యాంక్స్ మాత్రమే అడగడాన్ని తప్పుబడుతున్నారు నెటిజన్లు. ముందు విషెస్ చెప్పి ఆ తర్వాత థ్యాంక్స్ అడుగు అంటూ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eAiwfF

No comments:

Post a Comment

'Kashmiri Youth Don't Want To Die'

'...or go to jail.' from rediff Top Interviews https://ift.tt/PuENKGD