Thursday, 8 July 2021

దటీజ్ మహేష్ బాబు.. ఎంటరైన సూపర్ స్టార్ ఫ్యాన్స్! ట్విట్టర్‌లో మోత మోగుతోంది

సూపర్ స్టార్ ఎంత సాఫ్ట్‌గా ఉంటారో, ఆయన స్వభావం ఎలాంటిదో ఇప్పటికే చాలా మంది నటీనటులు చెప్పారు. స్టార్ హోదా ఉన్నప్పటికీ సెట్స్‌పై ప్రతిఒక్కరితో స్నేహపూర్వకంగా మెదిలే ఆయన.. తనకు నచ్చిన అన్ని విషయాలపై సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. నెట్టింట అంతగా యాక్టివ్ కాకపోయినా తనకు నచ్చిన విషయాలతో పాటు స్పెషల్ మూమెంట్స్ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన మేకప్ మ్యాన్‌ గురించి ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సాధారణంగా స్టార్ హీరోలు పెద్ద దర్శకులకు, నిర్మాతలకు, నటీనటులకు పుట్టినరోజు విషెస్ చెబుతుంటారు. కానీ అందుకు భిన్నంగా తన స్వభావం అందరికీ తెలిసేలా మేకప్ మ్యాన్‌‌ పట్టాభికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు మహేష్. ఈ రోజు (గురువారం) తన మేకప్ మ్యాన్ పట్టాభి పుట్టినరోజు కావడంతో ఆయనకు విషెస్ తెలుపుతూ మహేష్ బాబు ట్వీట్ పెట్టారు. నాకు తెలిసిన వారిలో 'ది బెస్ట్ మేకప్ మ్యాన్ మీరే' అంటూ మీ కెరీర్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నానని, మీ మీద ఎప్పటికీ ప్రేమ గౌరవం అలాగే ఉంటుందని పేర్కొన్నారు మహేష్. ఈ మేరకు ఆయనతో దిగిన పిక్ షేర్ చేశారు. మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ దానిని రీట్వీట్ చేస్తూ వైరల్ చేసేశారు. మహేష్ మేకప్ మ్యాన్ పట్టాభికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్‌లో మోత మోగిస్తున్నారు. మహేష్ నటన కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి మహేష్‌కి మేకప్ మ్యాన్‌గా పట్టాభినే వ్యవహరిస్తున్నారు. కాగా ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్నారు మహేష్ బాబు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yxpMjQ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....