Wednesday, 21 July 2021

అనసూయ: నిన్ను నాలో దాచుకోనా.. నన్ను నీలో పోల్చుకోనా అంటూ కారులో జబర్దస్త్ బ్యూటీ హుషారు!!

జబర్దస్త్ బ్యూటీగా బుల్లితెరపై దూసుకుపోతున్న సోషల్ మీడియాలోనూ హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్న ఈ బ్యూటీ.. వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. కాగా గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో.. తనదైన స్టైల్‏లో కామెంట్ వదిలింది ఈ ముద్దుగుమ్మ. ఈ మేరకు కారులో హాయిగా షికార్లు కొడుతున్న ఫొటోను జత చేయడంతో ఈ పోస్ట్ వైరల్ అయింది. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతరామ శాస్త్రి రాసిన పాటలోని చరణాలను పోస్ట్ చేసింది అనసూయ. ''చిన్ననాటి తాయిలంలా .. నిన్ను నాలో దాచుకోనా.. కన్నెయీటీ సోయగంలా .. నన్ను నీలో పోల్చుకోనా.. పెదవులు పాడేకిలకిలలోన.. పదములు ఆడే కథకళిలోన.. కనులను తడిపే కలతలలోన.. నా అణువణువున నువు కనిపించేలా.. నువ్వొస్తానంటే నేనొద్దంటాన.. వాన!'' అంటూ కవిత్వం పోస్ట్ చేసిన ఆమె 'రెయిన్ లవర్' అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఫుల్ ఎంజాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా చేసి తన నటనా ప్రతిభను చాటుకున్న అనసూయ.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ పట్టేస్తోంది. ''క్షణం, కథనం'' లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతోనూ అలరించిన ఆమె, ఇటీవలే 'థ్యాంక్యూ బ్రదర్' సినిమాలో చాలెంజింగ్ రోల్ చేసింది. ప్రస్తుతం సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. దీంతో పాటు మరో ఐదు ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3iD4Kd5

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....