వివాదాస్పద దర్శకుడు ఎప్పటికప్పుడు ట్రెండ్ క్యాచ్ చేసుకుంటూ సినిమాలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే '' అంటూ మరో సంచలనానికి తెరలేపుతూ కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో తనదైన దారిలో వెళ్తున్న ఆర్జీవీ.. రకరకాల కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. అచ్చం పవన్ కళ్యాణ్‌ని పోలిన యాక్టర్‌ని తీసుకొని.. 'ఎన్నికల ఫలితాల తర్వాత కథ' అనే ట్యాగ్ లైన్‌తో 'పవర్ స్టార్' మూవీ రూపొందిస్తున్నారు వర్మ. అయితే ఈ మూవీ టైటిల్ లుక్ మొదలుకొని ఇప్పటిదాకా విడుదల చేసిన అన్ని పోస్టర్స్ కూడా వర్మ క్రియేటివిటీకి అద్దం పడుతున్నాయి. ఈ పోస్టర్స్ చూసి తనను విమర్శించాలా? లేక ప్రశంసించాలా? అనేది కూడా అర్థంకాకుండా మెగా అభిమానులను తికమక పెట్టేస్తున్నారు వర్మ. ఇకపోతే తన 'పవర్ స్టార్' సినిమాలో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో పాటు ఓ రష్యన్ మహిళ కూడా ఉంటుందని ముందుగానే ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ.. చెప్పినట్లుగానే ఆ రిలీజ్ చేసి సినిమాపై చర్చలు ముదిరేలా చేశారు. అంతేకాదు ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఇది 'పవరొమాంటిక్ పోస్టర్' అని ఆయన పేర్కొనడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ ఇష్యూగా మారింది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఆయన ప్రెజెంట్ లైఫ్‌పై వర్మ కన్నేశారని ఈ పోస్టర్స్ చూసిన జనం చెప్పుకుంటున్నారు. కాగా ''లార్డ్ బాలాజీ మీద ఒట్టేసి చెబుతున్నా.. ఈ మూవీలో ఎవరినీ తక్కువ చేసి చూపించను'' అని వర్మ పేర్కొనడం మరో ఆసక్తికర అంశం. చూడాలి మరి ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో అతిత్వరలోనే రిలీజ్ కానున్న ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో!. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZWpOlO
No comments:
Post a Comment