Sunday 19 July 2020

Power star: గడ్డి తింటావా? మరో అస్త్రంతో రంగంలోకి వర్మ.. అనుకున్నట్టే అతన్ని కూడా లాగేశాడుగా!!

వివాదాస్పద దర్శకుడు '' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించిన నాటినుంచే జనాల్లో ఆసక్తి మొదలైంది. సినీ, రాజకీయ వర్గాలన్నింటిలో ఈ సినిమా గురించిన చర్చలు ముదిరాయి. అయితే తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో విలక్షణత చాటుతూ, సొంతంగా సినిమాపై హైప్ తీసుకొచ్చుకునే రామ్ గోపాల్ వర్మ.. 'పవర్ స్టార్' పోస్టర్స్ ద్వారానే ప్రేక్షకుల చూపు ఈ మూవీ వైపు తిప్పేశారు. వరుస పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సంచలనం సృష్టించారు. తాజాగా మరో అడుగు ముందుకేసి 'పవర్ స్టార్' నుంచి సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు వర్మ. పవర్ స్టార్ సాంగ్ 'గడ్డి తింటావా?' ఈ రోజు (జులై 19) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు రామ్ గోపాల్ వర్మ. ఇందులో నటించే హీరో.. తన ఫాంహౌస్‌లో త‌న గేదెలు, చెట్లను ఉద్దేశిస్తూ ఈ పాట పాడతాడ‌ని ఆయన తెలిపారు. ఈ మేరకు పవర్ స్టార్ గేదెలకు గడ్డి వేస్తున్న పిక్ షేర్ చేశారు. ఇక ఈ మూవీ ట్రైలర్ జూలై 22 ఉదయం 11 గంటలకు, సినిమా జులై 25వ తేదీ 11 గంటలకు world theatreలో రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ వెంటనే మరో ట్వీట్ చేసిన వర్మ.. కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. అంతేకాదు ఈ పోస్టర్‌లో కనపడుతున్న పాత్ర నిజ జీవితంలో ఎవరినైనా పోలి ఉందా? అని ప్రశ్నించారు. చేతిలో కొబ్బరికాయ పట్టుకొని అచ్చం ఓ నిర్మాతలా ఉన్న ఆ వ్యక్తిని చూసి.. ఊహించిందే జరిగింది, అదిగో అతనే ''బండ్ల గణేష్'' అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తంగా చూస్తే పవర్ స్టార్ సినిమా సినీ, రాజకీయ వర్గాల్లో మరో సంచలనం కావడం ఖాయమే అని తెలుస్తోంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32urC8t

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...