Sunday, 26 July 2020

రియల్ హీరో సోనూసూద్.. సాయంత్రానికే ట్రాక్టర్ వచ్చేసింది.. మదనపల్లి ఫ్యామిలీ ఫుల్ ఖుషీ

ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నారు. రైతు కుటుంబానికి సాయం చేస్తానని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆ మాట నిలబెట్టుకున్నారు. సోనూసూద్‌ జిల్లా మదనపల్లెలో ట్రాక్టర్‌ ఆర్డర్‌ చేశాడు. దీంతో షోరూం నిర్వాహకులు రైతు నాగేశ్వరరావుకు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్‌ను అందజేశారు. దీంతో నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సోనూసోద్‌కు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్బంగా సోనూకు రైతు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. Must Read: చిత్తూరు జిల్లా మదనపల్లిలో నాగేశ్వరరావు టీ హోటల్ నిర్వహించేవాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆయన కుటుంబానికి ఉపాధి పోయింది. దీంతో నాగేశ్వరావు కుటుంబంతో కలిసి సొంత గ్రామానికి వెళ్లిపోయారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. దున్నేందుకు ఎద్దులు లేక సతమతమవుతుంటే.. ఆయన కన్నబిడ్డలే కాడిపట్టుకుని నడిచారు. వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే.. వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వస్తున్నారు. Also Read: ఇది ఓ జర్నలిస్ట్ కెమెరా కంటికి చిక్కగా.. ఆయన తన ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోనూసూద్ కంట పడింది. వెంటనే సాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. మొదట ఆ రైతులకు ఓ జత ఎద్దులు పంపుతానని వెల్లడించారు. కొంతసేపటి తర్వాత వారు ఎద్దులు కాదు.. వారికి కావాల్సింది ఓ ట్రాక్టర్ అని ట్వీట్ చేశారు. వారికి సాయంత్రాని కల్లా ట్రాక్టర్ పంపిస్తానని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే షోరూం నిర్వాహకులు రైతు నాగేశ్వరరావుకు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్‌ను అందజేశారు. సోనూసూద్ గొప్ప మనసు’ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. Must Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32Vbgpu

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....