Sunday 19 July 2020

‘గంగోత్రి’ వల్లంకి పిట్ట రెడీ.. లా పూర్తిచేసి హీరోయిన్‌గా ఎంట్రీ

అంటే ప్రస్తుతం ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలిచిత్రం ‘గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట’ పాటని గుర్తు చేస్తే టక్కున ఆ పాటలోని చిన్నారి పాప గుర్తొస్తుంది. ఆ పాపే కావ్య. అక్షరాలా తెలుగు అమ్మాయి. ఈనెల 20వ తేదీ సోమవారం నాడు కావ్య పుట్టినరోజు. ‘బాలు’, ‘అడవిరాముడు’, ‘అందమైన మనసులో’, ‘విజయేంద్రవర్మ’ మొదలైన సినిమాల్లో బాలనటిగా చేసింది కావ్య. శ్రీదేవి, మీనా, రోజారమణి, రాశి, హన్సిక, లయ.. ఇలా ఎందరో బాలతారలుగా వచ్చి హీరోయిన్స్‌గా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోగలిగారు. వీరిలో కొంత మంది స్టార్ హీరోయిన్స్ కూడా అయ్యారు. అలా కావ్య కూడా తన కలలు, ఆశయాలు నెరవేర్చుకునేలా సినిమా రంగంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆశిస్తోంది. ఇప్పుడు హీరోయిన్ కాబోతుంది. అంతకన్నా ముందు దాదాపు పదిహేనేళ్ల నుంచి కూచిపూడి డాన్సర్ ఈమె. బాలనటిగా సినిమాల్లోకి అగుపెట్టిన కావ్య.. నాట్యంతో తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుంది. Also Read: అలాగని కావ్య చదువు నిర్లక్ష్యం చేయలేదు. పూణేలోని ఓ కాలేజిలో లా పూర్తి చేసింది. చదువు పూర్తిచేసి సినిమా వైపు దృష్టి సారించింది. తెలుగుతో పాటు తమిళం, మళయాళ సినిమాలకు కూడా ఆడిషన్స్ చేస్తుంది కావ్య. ఆడిషన్స్‌తో ప్రస్తుతం బిజీ బిజీగా ఉంటుంది. తన ప్రయత్నాల గురించి తాజాగా కావ్య మాట్లాడింది. ‘‘లాక్‌డౌన్‌కి ముందు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇది రాకుండా ఉంటే నా ప్రాజెక్ట్ ఈ పాటికి కచ్చితంగా అనౌన్స్ అయి ఉండేది’’ అని కావ్య చెప్పింది. ‘‘గంగోత్రి అప్పుడు నాకు మూడు, నాలుగేళ్ల వయసు ఉంటుంది. సినిమా గురించి అంతగా తెలియదు. అలా 12 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఎదిగే కొద్దీ హీరోయిన్ కావాలనుకున్నాను. చదువంటే ఆసక్తి. చదివితే ఇప్పుడే చదివేయాలి. పూర్తి చేయాలి. యాక్టింగ్‌లోకి వచ్చి చదవలేకపోయానే అని బాధపడకూడదు. చదువుకుంటే ప్రపంచాన్ని బాగా తెలుసుకుని.. అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే లా కంప్లీట్ చేశాకే సినిమా కెరీర్‌ని సీరియస్‌గా తీసుకున్నాను’’ అని కావ్య చెప్పుకొచ్చింది. Also Read: చదువుతో పాటు రెగ్యులర్ డాన్స్ ప్రాక్టీస్, ఫిజిక్ మీద అవసరమైన శ్రద్ధ తీసుకున్నానని వెల్లడించింది కావ్య. ‘‘పూణేలో ఉన్నా మీకన్నా ఎక్కువ సినిమాలు చూశాను. సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ప్రతి సినిమా ఫాలో అవుతాను. తెలుగు చదువుతాను, మాట్లాడతాను. తెలుగు అమ్మాయిని కావడం అడ్వాంటేజ్‌గా ఫీలవుతున్నాను. ఎందుకంటే మన తెలుగు కల్చర్, నేటివిటీ కచ్చితంగా హిందీ హీరోయిన్ల కన్నా తెలుగు అమ్మాయిలకే అర్థమవుతుంది. స్క్రిప్ట్‌ని సులభంగా అర్థం చేసుకోగలం. ఆ పాత్రల బిహేవియర్స్ ఈజీగా పట్టుకోగలం’’ అని కావ్య తెలిపింది. ఏ పాత్ర చేసినా ఒక నటిగా తనకు అది ఉపయోగపడాలని, అలాగే తానూ ప్రాజెక్ట్‌కి ఉపయోగపడాలని కావ్య చెప్పింది. ‘‘నాకు రియాలిటీకి దగ్గరగా ఉండేవి, ఇంట్రెస్టింగ్, ఛాలెంజింగ్ రోల్స్ ఇష్టం. ప్రస్తుతం ఇండస్ట్రీ పాజ్‌లో ఉంది. కానీ, ఇందాక చెప్పినట్లు లాక్‌డౌన్ ముందు నుంచే ట్రై చేస్తున్నాను. ఇళ్లల్లో కూర్చున్నవాళ్లంతా డిజిటల్ ప్లాట్‌ఫాంలలో, ఆన్‌లైన్‌లో, టీవీ ఛానెల్స్‌లో విపరీతంగా సినిమాలు, సిరీస్‌లు చూస్తున్నారు. కంటెంట్ అయిపో వస్తోంది. ఎంతో ఎంటర్‌టైనింగ్ కంటెంట్ జనానికి అవసరం. అందువల్ల అవకాశాలకి ఇబ్బంది ఉండదని భావిస్తున్నాను. కాస్త ఆలస్యం కావచ్చు’’ అని కావ్య వెల్లడించింది. ఓటీటీకి సంబంధించి ఆసక్తికర సబ్జెక్ట్ ఏదైనా వస్తే చేస్తానని కావ్య స్పష్టం చేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jlc24Q

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...