కోలీవుడ్ స్టార్ హీరో ఇంట్లో ఉందంటూ స్థానిక పోలీసులకు శనివారం అర్ధరాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి భయపడుతూ ఈ విషయం చెప్పడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. విజయ్ ఇంట్లో, ఇంటి పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. ఉన్నట్టుండి హీరో విజయ్ ఇంటి చుట్టూ పోలీసులు మొహరించడంతో అందరూ ఆందోళన చెందారు. బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్‌తో విజయ్ ఇంటి పరిసరాలన్నీ గాలించారు పోలీసులు. ఎంత వెతికినా బాంబ్ ఆచూకీ లభించకపోవడంతో అది ఫేక్ కాల్ అని కన్ఫర్మ్ చేసిన పోలీసులు, విజయ్‌కి వివరణ ఇచ్చారు. కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయనతో చెప్పారు. ఇలా విజయ్ ఇంట్లో అర్థరాత్రి హై డ్రామా నడిచింది. అనంతరం ఆ ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని కనిపెట్టే పనిలోపడ్డ పోలీస్ యంత్రాంగం అతని ఆచూకీ కనుక్కున్నారు. ఆ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు అతను విల్లుపురానికి చెందిన వ్యక్తి అని మీడియాతో చెప్పారు. అయితే ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని, దీంతో జాగ్రత్తగా ఉంచాలని అతని కుటుంబ సభ్యులను హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. Also Read: గత నెలలో అచ్చం ఇదే తరహాలో రజినీకాంత్ ఇంట్లో బాంబు ఉందని ఫేక్ కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు సీఎం పళనిస్వామి ఇంట్లో కూడా బాంబ్ ఉందని బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఫేక్ కాల్స్, వాట్సాప్ సందేశాలపై సీరియస్‌గా పోలీసుల నిఘా అవసరమని తమిళనాడు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2O2wKrH
No comments:
Post a Comment