Sunday 19 July 2020

‘పవర్ స్టార్’కు పోటీగా ‘పరాన్న జీవి’.. వర్మపై పవన్ ఫ్యాన్ సినిమా!!

రామ్ గోపాల్ వర్మ పేరు చెబితేనే మనకు ‘వివాదాస్పదం’ గుర్తుకు వస్తుంది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరినీ ఏదో రకంగా కెలుకుతూ ఉంటారాయన. కానీ, ఆయన జోలికి మాత్రం ఎవ్వరూ వెళ్లరు. కారణం, బురదలో రాయి వేస్తే అది మన మీదే పడుతుందని. నాగబాబు లాంటి వాళ్లు అప్పుడప్పుడు వర్మపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే, వర్మ వదిలే వివాద బాణాలు అలా ఉంటాయి మరి. కానీ, ఎంతకాలమని ఆయన పైత్యాన్ని బాధితులు భరిస్తారు. కష్టం కదా? అందుకే, ఇప్పుడు తిరగబడుతున్నారు. సమాజంలో సెలబ్రిటీ స్టేటస్ ఉన్న చాలా మందిపై సెటైరికల్ సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మపై ఇప్పుడు ఒక సినిమా రాబోతోంది. అది కూడా సెటైరికల్ మూవీనే. పేరేంటో తెలుసా? ‘పరాన్న జీవి’. ‘రెక్‌లెస్ జెనిటిక్ వైరస్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా తీస్తోన్నది ఉత్తరాంధ్రకు చెందిన ఒక పవన్ కళ్యాణ్ అభిమాని అని తెలిసింది. ‘పవర్ స్టార్’ అంటూ పవన్‌పై వ‌ర్మ సినిమా తీస్తుంటే.. ఆర్జీవీపై ప‌వ‌న్ అభిమాని ఓ సినిమా తీయ‌డం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. Also Read: రామ్ గోపాల్ వర్మపై ఇప్పటికే గేయ రచయిత జొన్నవిత్తుల ఒక సినిమాను ప్రకటించారు. ‘ఆర్జీవీ - రోజూ గిల్లే వాడు’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమా కన్నా ఇప్పుడు ‘పరాన్న జీవి’పై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి మద్దతు లభిస్తోంది. ‘పవర్ స్టార్’ సినిమాను ఈనెల 25న ఆర్జీవీ వరల్డ్ థియేటర్ వెబ్‌సైట్‌లో వర్మ విడుదల చేస్తున్నారు. ఇప్పుడు దీనికి పోటీగా ‘పరాన్న జీవి’ని సిద్ధం చేస్తున్నారట పవన్ ఫ్యాన్స్. నిజానికి వర్మ ‘పవర్ స్టార్’ సినిమా ప్రకటించడం, రకరకాల పోస్టర్లను ట్విట్టర్ ద్వారా వడలడంతో ఆయనపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మండిపోతున్నారు. దొరికితే కసితీరా రివేంజ్ తీర్చుకోవడానికి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో వాళ్లకు ‘పరాన్న జీవి’ దొరికింది. ఇక వదులుతారా. ఎప్పుడూ పక్కోడిపై ప‌డిపోయి, బ‌తికేసే ఆర్జీవికి.. భ‌లే సూటైపోయిన పేరు క‌దా..? అని టైటిల్ గురించే సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అలాంటిది రేపు సినిమా వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో. అసలు వర్మపై ఆ సినిమాలో ఏం చూపించబోతున్నారో? ఊహించుకుంటేనే ఆత్రుత పెరిగిపోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Bcrdfu

No comments:

Post a Comment

'Markets Not In Panic Yet, But...'

'If you see another 1000-point correction, people may start panicking.' from rediff Top Interviews https://ift.tt/RjF0mDo