Sunday 19 July 2020

‘మాయాబజార్’లో వాడని పాట.. 63 ఏళ్ల తర్వాత సింగీతం స్వరం వెంట

‘’ సినిమా గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆ సినిమా విడుదలై ఆరు దశాబ్దాలు దాటినా ఇప్పటి తరానికి కూడా పరిచయమే. అంత గొప్ప సినిమా ‘మాయాబజార్’. ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్నార్, సావిత్రి, గుమ్మడి వంటి హేమాహేమీలు నటించిన భారీ చిత్రం. తెలుగు సినిమా చరిత్రలోనే ‘మాయాబజార్’ ఒక ఆణిముత్యం. సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో పాటలు కూడా అంతే బాగుంటాయి. ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు, ఘంటసాల సంగీతం అందించారు. ‘మాయాబజార్’ సినిమాకు ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సినిమాలో వాడని పాట గురించి 63 ఏళ్ల తరవాత తాజాగా ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. ‘మాయాబజార్’ సినిమాకు మొదట సాలూరి రాజేశ్వరరావు గారిని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఆయన ఈ సినిమా కోసం నాలుగు పాటలు స్వరిపరిచారు. ‘శ్రీకరులు దేవతలు’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘నీకోసమే నే జీవించునది’ పాటలను రాజేశ్వరరావు చేశారు. Also Read: అయితే, ఐదో పాట కూడా రాజేశ్వరరావు గారు స్వరపరిచారట. ప్రియదర్శిని పెట్టెను శశిరేఖ తీస్తుంటే అభిమన్యుడు కనిపించినప్పుడు వచ్చే పాట అది. గేయ రచయిత పింగళి నాగేంద్రరావు పల్లవి రాశారు. ‘కుశలమా కుశలమా నవ వసంత మధురిమ’ అంటూ సాగే పల్లవికి సాలూరి రాజేశ్వరరావు అద్భుతమైన ట్యూన్ కట్టారు. కానీ, ఆ తరవాత కొన్ని కారణాల వల్ల రాజేశ్వరరావు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో ఘంటసాల గారిని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. అయితే, ఈ పాటను సినిమాలో వాడుకోలేకపోయామే అని దర్శకుడు కేవీ రెడ్డి.. సింగీతం శ్రీనివాసరావుతో చెప్పి బాధపడేవారట. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఇంట్లో ఖాళీగా ఉన్న సింగీతం గారికి అప్పటి పాట విషయం గుర్తుకు వచ్చింది. ఆ పాటను ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. వెంటనే అప్పటి పల్లవికి కొనసాగింపుగా పాట రాయాలని వెన్నెలకంటిని కోరారట. ఆయన పల్లవితో పాటు రెండు చరణాలు రాశారట. ఈ పాటకు సింగీతం శ్రీనివాసరావు స్వయంగా ట్యూన్ కట్టారు. జైపాల్ సంగీతం సమకూర్చారు. గౌతంరాజు ఎడిటింగ్ చేశారు. తన మనవరాలు అంజనీ నిహిలతో కలిసి సింగీతం ఈ పాటను ఆలపించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32xYWeL

No comments:

Post a Comment

'Markets Not In Panic Yet, But...'

'If you see another 1000-point correction, people may start panicking.' from rediff Top Interviews https://ift.tt/RjF0mDo