Thursday 2 January 2020

Allu Arjun: `అల వైకుంఠపురములో`.. ఎవరూ లేకుండానే..!

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో. బన్నీ కెరీర్‌కు కీలకమైన సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్‌ గత చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న బన్నీ ఈ సినిమాలో ఎలాగైన సూపర్‌ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం సెన్సార్‌ ఫార్మాలిటీస్‌ కూడా పూర్తి చేసుకోనుంది. సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే అధికారికంగా జనవరి 12న సినిమా రిలీజ్‌ అంటూ ప్రకటించినా రిలీజ్‌ డేట్ విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రయూనిట్ మాత్రం రిలీజ్‌ డేట్‌ మార్పుపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. Also Read: తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సంబంధించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను జనవరి 6న నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. సాధారణంగా ఒక హీరో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మరో హీరోనో.. లేదా వేరే ఎవరైనా సినీ ప్రముఖులో రావటం ఆనవాయితీగా వస్తోంది. కానీ అల వైకుంఠపురములో ఈవెంట్‌కు మాత్రం ఏ అతిథి హాజరు కావటం లేదట. కేవలం చిత్రయూనిట్ మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్న టాక్‌ వినిపిస్తోంది. సంక్రాంతి సీజన్‌లోనే రిలీజ్‌ అవుతున్న మరో భారీ చిత్రం సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్‌ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. దీంతో అల వైకుంఠపురములో వేడుకకు ఏ అతిథి హాజరుకావటం లేదన్న వార్తలపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి చివరి నిమిషంలో ఎవరినైనా తీసుకువస్తారేమో చూడాలి. Also Read: అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో టబు, జయరామ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ హీరో సుశాంత్‌, నివేదా పేతురాజ్‌లు మరో జోడిగా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్, రాధకృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36o9fRu

No comments:

Post a Comment

The Spy Who Became A Farmer

'Everything about farming is enjoyable and relaxing.' from rediff Top Interviews https://ift.tt/xBDjVyT