Tuesday 22 October 2019

రౌడీ సినిమా రీమేక్‌.. సైలెంట్‌గా మొదలెట్టిన బాలీవుడ్‌ మేకర్స్‌

టాలీవుడ్‌ సెన్సేషనల్‌ స్టార్‌ హీరోగా తెరకెక్కిన ఫాంటసీ థ్రిల్లర్ మూవీ . రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమా ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్‌. ఎన్నో అవాంతరాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది. అయితే రిలీజ్ చాలా సార్లు వాయిదా పడటం, రిలీజ్‌కు ముందే సినిమా అన్‌ ఎడిటెడ్‌ వర్షన్‌ పైరసీ కావటంతో సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది. అయితే టాక్సీవారా రిలీజ్‌ అయిన దగ్గర నుంచి ఈ సినిమా బాలీవుడ్‌ రీమేక్‌పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా విజయ్‌ దేవరకొండతోనే ఈ సినిమాను బాలీవుడ్‌ లో రీమేక్‌చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ సినిమా భారీ విజయం కాకపోవటంతో విజయ్‌ ఆ ఆలోచన విరమించుకున్నాడు. తరువాత పలువురు బాలీవుడ్‌ హీరోలు ఈ రీమేక్‌లో నటిస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. Also Read: అయితే తాజాగా ఈ రీమేక్‌ విషయంలో క్లారిటీ వచ్చింది. టాక్సీవాలా రీమేక్‌ను ఇషాన్‌ ఖట్టర్‌ హీరోగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభమైంది. జీ స్టూడియోస్‌, ఏఏజెడ్‌ ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 11 ప్రారంభమైంది. ఖాలీ పీలి పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో ఇషాన్‌ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. జైదీప్‌ అహ్లవత్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మక్బూల్‌ ఖాన్‌ దర్శకుడు. Also Read: ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఓ అమ్మాయి ఆత్మ టెక్నాలజీని ఉపయోగించిన తన శరీరాన్ని విడిచి పెట్టడం, తరువాత ఆ అమ్మాయి ఆత్మ తన శరీరంలోకి వెళ్లలేక ఓ కారులో ఉండిపోవటం అన్న డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 2018 నవంబర్‌లో రిలీజ్‌ అయ్యింది. గీతాఆర్ట్స్‌ 2, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. గీత గోవిందం సినిమా తరువాత నోటా సినిమాతో నిరాశపరిచిన విజయ్‌ దేవరకొండ, టాక్సీవాలాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. ఈ సినిమా సక్సెస్‌తో విజయ్‌ దేవరకొండ మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. విజయ్‌ దేరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో హీరో, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్‌ సినిమాలు చేసేందుక ఓకే చెప్పాడు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MY4vcM

No comments:

Post a Comment

'What Was Samsung Doing For 16 Years?'

'Samsung declared they would not allow the presence of any trade union.' from rediff Top Interviews https://ift.tt/py9LrCB