Wednesday 2 October 2019

సైరా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ : 50 కోట్ల క్లబ్‌లో మెగాస్టార్

చిరంజీవిని మెగాస్టార్ అని ఎందుకు పిలుస్తారో, ఎందుకు పిలవాలో బాక్సాఫీస్ దగ్గర వస్తున్న కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది. టాక్ ఒక మోస్తరుగా ఉంటేనే కలెక్షన్స్ పరంగా చరిత్ర సృష్టించే దమ్ము ఉన్న మెగాస్టార్ ఒక చారిత్రాత్మక సినిమాతో వస్తే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో సినిమా తెలియజేస్తుంది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన సైరా మొదటి రోజు వసూళ్ల వర్షం కురిపించి ధీమాగా 50 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లింది. ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ నడుస్తుంది. దీంతో ఈ వీకెండ్‌కే ఈ సినిమా సేఫ్ అయిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. Also Read: హిందీలో మరొక పెద్ద సినిమా వార్ రిలీజ్ అయినా కూడా సైరా స్వింగ్ మాత్రం కొనసాగింది. దీంతో అక్కడ సైరా మొదటి రోజు రెండున్నర కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాలోని పేట్రియాటిజం అక్కడి వాళ్లకు ఫుల్లుగా కెనెక్ట్ అయ్యింది. ఈ సినిమాని ఝాన్సీ లక్ష్మి భాయ్ పాత్రతో మొదలుపెట్టడంతోనే అక్కడివాళ్లు సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయారు. దాంతో సైరాకి రివ్యూస్‌తో పాటు మౌత్ టాక్ ఒక రేంజ్‌లో వస్తుంది. ఉరి సినిమాలానే సైరా కూడా అక్కడ రోజురోజుకి వసూళ్ల లెక్కలు పెంచుకుంటూ వెళుతుంది అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మరొక పక్క వార్ ప్రీ‌ బుకింగ్స్ పరంగా బాగా పెర్ఫార్మ్ చేసినా కూడా ఈరోజు నుండి డౌన్ ట్రెండ్ తప్పకపోవచ్చు అంటున్నారు. Also Read: రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడులో కూడా సైరా వసూళ్లు పీక్స్‌లో ఉన్నాయి. ఇది నిజంగా జరిగిన కథ కావడంతో అంతా కూడా దీన్ని తమ సొంత సినిమాలా భావిస్తున్నారు. దీంతో సౌత్‌లోని నాలుగురాష్ట్రల నుండే దాదాపు నలభై కోట్ల కి పైగా షేర్ వచ్చింది.ఒక్క కేరళలో మాత్రం టాక్‌కి తగ్గ వసూలు లేవు. తెలుగు స్టేట్స్‌లో అయితే చాలా చోట సైరా నాన్ బాహుబలి రికార్డ్స్‌ని దక్కించుకుంది, కానీ ఫుల్ రన్‌లో మాత్రం బాహుబలిని దాటి బాహుబలి 2 (తెలుగు వసూళ్లు) దగ్గరికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. రిలీజ్‌కి ముందు వరకు సైరాకి హిట్ టాక్ వస్తే 800 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని అంచనా వేశారు. కానీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో మెగాస్టార్ 1000 కోట్ల మార్క్‌ని టచ్ చేస్తాడు అని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. Also Read: ఓవర్సీస్‌లో మాత్రం సైరా ఎందుకో కాస్త తగ్గింది. ముఖ్యంగా నాన్ హాలిడే రోజు అక్కడ రిలీజ్ కావడం అనేది ఈ సినిమాకి అక్కడ కాస్త ఇబ్బందిగా మారింది. ప్రీమియర్స్‌తో మిలియన్ డాలర్స్ మార్క్ అందుకోలేకపోయిన సైరా రెండోరోజు మాత్రం 1 మిలియన్ మార్క్‌ని టచ్ చేసింది. కానీ ఇంకా అక్కడ మాత్రం కాస్త డల్ నోట్ లోనే కలెక్షన్స్ రికార్డ్ అవుతున్నాయి. రేపటినుండి వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కలెక్షన్స్ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సాహోతో నష్టపోయిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాతో మాత్రం లాభాలు అందుకోవడం ఖాయం. ఈ వారాంతానికి సైరా అక్కడ కూడా 2.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రిపోర్ట్స్ మాత్రం రావాల్సి ఉంది. అవి కలపకుండానే మెగాస్టార్ 50 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2oBZ4YP

No comments:

Post a Comment

'Kashmiri Youth Don't Want To Die'

'...or go to jail.' from rediff Top Interviews https://ift.tt/PuENKGD