నగరి ఎమ్మెల్యేగా రెండో సారి గెలిచిన సినీ నటి .. జబర్దస్త్ రీ ఎంట్రీ తరువాత ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. శుక్రవారం నాటి ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కాలక్షేపంతో పాటు వినోదాన్ని అందించే టీవీ షోలలో ప్రత్యేక స్థానం జబర్దస్త్‌దే. టీవీలో ప్లే అయ్యేది ఒకరోజైనా.. వారం మొత్తంలో ఏదో చోట, ఎవరొకరి ఫోన్‌లో జబర్దస్త్ నవ్వు వినిపిస్తూనే ఉంటుంది. నిజానికి ఆ షో చూస్తున్నప్పుడు కొందరు స్కిట్‌లోకి రాగానే ‘డైలాగ్ ఏం చెబుతాడా’ అని ఎదురుచూస్తుంటేనే నవ్వు వచ్చేస్తుంది. కొందరు ఎక్స్‌ప్రెషన్‌తో పొట్ట చెక్కలు చేస్తే.. మరికొందరు వెర్రిపప్పలై నవ్వుని పండిస్తారు. ఇక ఎక్స్‌ట్రా జబర్దస్త్ సంగతి చెప్పనక్కర్లే. పేరులో ఉన్న ఎక్స్‌ట్రాని కామెడీలో కలిపి.. ప్రేక్షకుల మీదకి లాంఫింగ్ గ్యాస్‌ని రిలేజ్ చేస్తాయి అన్ని టీమ్స్. ఈ వారం ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో హైలెట్స్ చూద్దాం! ‘నూటాడభ్బైఆరు బీచ్ హౌసులో ప్రేమ దేవతా.. ఎల్లో చుడీదార్, వైట్ చున్నీతో దోచనాయదా..! అనే బ్యూటిఫుల్ సాంగ్‌కి తగ్గట్టుగా ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్‌లో కిరాక్ స్టెప్పులతో అదరిపోయే ఎంట్రీ ఇచ్చింది యాంకర్ రష్మి . తర్వాత ఎంట్రీ ఇచ్చిన జడ్జ్ రోజా కూడా ‘ఆటకావాలా? పాటకావాలా? స్వచ్ఛమైన అచ్చతెలుగు బీటుకావాలా?‘ అంటూ మతిపోగొట్టే మాస్ స్టెప్పులతో ‘జబర్దస్త్’ స్టేజ్‌ను ఓ ఊపు ఊపేశారు. సాంగ్‌కి తగ్గట్టుగా హావభావాలు పలికిస్తూ.. డాన్స్‌తో ఇరగదీశారు. రోజాకి యాంకర్ రష్మి కూడా జత కలవడంతో మంచి ‘ఆటకావాలా.. పాట కావాలా’ సాంగ్ అదిరిపోయింది. ఇక మరో జడ్జ్ నాగబాబు కూడా ఎప్పటిలాగే తన సిగ్నేచర్ మూమెంట్‌తో ఎక్స్ ట్రా జబర్దస్త్‌కి ఎంట్రీ ఇచ్చారు. ఇక స్కిస్ట్ విషయానికి వస్తే.. ‘నీ కొప్పులో నా మల్లిపూలు‘ అనే ఊతపదంతో.. చమ్మక చంద్ర లేడీ గెటప్‌లో ఎప్పటిలాగే రష్మిని టార్గెట్ చేసి ఓ ఆట ఆడుకోగా.. బుల్లెట్ భాస్కర్, చంటిలు డ్రంక్ డ్రైవ్ స్కిట్‌తో ఆకట్టుకున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఫసక్ శశిలు నవ్వుల వినోదాన్ని జబర్దస్త్‌లో అందించారు. ఈ ఎపిసోడ్‌ను చూడటం కోసం
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2WZ73PR
No comments:
Post a Comment