దారెటు.. గత ఎన్నికల ఫలితాల్లో ఘోర వైఫల్యం తరువాత పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు. మళ్లీ సినిమాల వైపు యూ టర్న్ తీసుకోబోతున్నారా? లేక పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారా? లాంటి ప్రశ్నలపై సినీ, రాజకీయ వర్గాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తాను సినిమాల్లో నటించనని.. రాజకీయాల్లోనే కొనసాగుతా అంటూ పలుమార్లు కుండబద్దలు కొట్టేసినా సినిమాల్లోకి పవన్ రీ ఎంట్రీ అంటూ రోజుకో వార్త పుట్టుకొస్తూనే ఉంది. తాజాగా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు. నరసాపురం పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన నాగబాబు.. ఓటమి అనంతరం ఫేస్ బుక్ లైవ్ నిర్వహించి కారణాలను వివరించారు. ఈ సందర్భంగా తన జర్నీ పవన్ కళ్యాణ్ తోనే కొనసాగిస్తాఅని.. నరసాపురంలో నెలలో కొన్నాళ్ల పాటు ఉండి తన వంతు సేవ చేస్తా అన్నారు నాగబాబు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా? అని నెటిజన్ల నుండి వరుసగా ప్రశ్నలు రావడంతో వాటిపై క్లారిటీ ఇచ్చారు నాగబాబు. ‘పవన్ సినిమాల్లో నటించడం ఇక కుదరదు. ఒకసారి చేయను అని చెప్పేశారు. చిరంజీవి రాజకీయాలు వద్దనుకున్నారు కాబట్టే రాజకీయాల్లోకి వచ్చారు. పవన్ అలా కాదు ఆయన రాజకీయాల్లో ఉండలను కుంటున్నారు. ఇక సినిమాలు చేయడం అనేది జరగదు. 90 శాతం సినిమాలు చేయరు. అయితే ఎప్పుడైనా మేం అడిగితే గెస్ట్ రోల్స్ ఏమైనా చేస్తారేమో చూడాలి’ అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు. ఇంకా ఏమన్నారంటే.. రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం.. ‘ఓడిపోవడం అనేది మాకు కొత్తకాదు. ఓడిపోయినంత మాత్రాన వెనక్కి తగ్గే వాళ్లం కాదు. నా రాజకీయ ప్రయాణం పవన్ కళ్యాణ్‌తో మొదలైంది. ఇకపై కూడా పవన్ కళ్యాణ్‌తోనే నా ట్రావెల్. గత ఎన్నికల్లో నేను పోటీ చేసి ఓడిపోయిన నరసాపురంలోనే ఉంటా. టోటల్‌గా ఉండటం కష్టం కాబట్టి కొన్ని రోజులు అక్కడ ఉండటానికి ప్లాన్ చేసుకుంటా. చంద్రబాబుపై కోపం జగన్‌కి గెలిపించింది.. ఈ ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాం. మేం జనంలోకి వెళ్లినప్పుడు చాలా మంది చెప్పింది ఏంటంటే.. అనుభవం ఉందని చంద్రబాబుని గెలిపిస్తే.. ఆయన ఏం చేయలేదు కాబట్టి.. చాలా కోపంగా ఉంది. ఈ తరుణంలో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. పవన్‌పై నమ్మకం ఉన్నా.. కొత్తగా ఏర్పడిన పార్టీ కాబట్టి.. పవన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరేమో అనిపిస్తుంది. అందుకే మా ముందు జగన్‌కి ఓటు వేయడం తప్ప వేరే మార్గం లేదన్నారు. 2024లో పవన్‌కి అవకాశం ఇస్తానన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్.. ఎన్నికల్లో ఓడిపోయినవాళ్లు చేతకాని వాళ్లు కాదు. నా వరకూ నేను ఇంకాస్త పనిచేసి ఉంటే గెలిచే వాడినేమో అనిపించింది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనే దాంట్లో వాస్తవాలు ఎవరికీ తెలియదు. 10 శాతం ట్యాంపరింగ్ చేసినా ఫలితాల్లో చాలా తేడాలు వస్తాయి. అయితే ట్యాంపరింగ్ జరిగిందన్న దాన్ని తీసేయలేం. ఈ సందర్భంలో ఓడిపోయాం కాబట్టి ట్యాంపరింగ్ ఆరోపణలు చేస్తున్నాం అని అనుకుంటారు. అయితే ఎలక్షన్ కమీషన్ చాలా వరకూ కాంప్రమైజ్ అయ్యింది. జగన్‌ని గెలిపించింది సింపథీ.. జగన్ ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా చేసి ఉంటే ఆయన పాలన చూసి జనం ఓట్లు వేశారని అనుకోవచ్చు. అయితే ఈ ఎన్నికల్లో జగన్‌ని గెలిపించింది ప్రజల్లో ఆయనకు ఉన్న సింపథి. గత ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల ఆయనక ఒక్క ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. టీడీపీపై ఉన్న విపరీతమైన వ్యతిరేకత కూడా జగన్‌కి బాగా కలిసి వచ్చింది. టార్గెట్ 2019 కాదు.. 2024 పవన్ కళ్యాణ్ తొలినుండి మన టార్గెట్ 2024 అని చెబుతూ ఉన్నారు. అందుకే ప్రజలు ఇప్పుడు జగన్‌కి అవకాశం ఇచ్చి.. 2024లో పవన్‌ని పవన్ గెలపిస్తారనే నమ్మకం ఉంది. జగన్ చేసేది మంచి పాలనా? జగన్ చేస్తున్న పనులపై మీ అభిప్రాయం చెప్పమంటే చెబుతాం.. అంతే కాని ఆయన చేసే మంచి పనులపై మీ అభిప్రాయం చెప్పమంటే ఎలా చెప్తాం. అది కరెక్ట్ ప్రశ్న కాదు. మొత్తానికి కొత్తగా జగన్ ప్రభుత్వం ఏర్పడింది.. ఇప్పుడే ఇలా చేశారు.. అలా చేశారు అంటూ కరెక్ట్ కాదు. కొంత సమయం ఇద్దాం.. ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెడతారో చూద్దాం. జగన్ చేస్తున్న మంచి పనులపై మా అభిప్రాయం చెప్పమంటే ఎలా చెప్తాం. ఆయన పనులపై చేయమంటే చెప్తాం. ఇప్పుడే ఆయన పరిపాలపై మనం నోటికొచ్చినట్టు చెప్పడం కరెక్ట్ కాదు. కొంత సమయం ఇద్దాం.. ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెడతారో చూద్దాం.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2Y3gVVn
No comments:
Post a Comment