ఎన్నికల తరువాత ‘మా’ ఎలా ఉంటుందో అని చాలా టెన్షన్ పడ్డానని.. అయితే ఇప్పుడు ‘మా’ సభ్యుల్లో ఉన్న ఐక్యమత్యం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు నటి హేమ. ఆదివారం నాడు హైదరాబాద్‌లో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్‌లో లేడీ ఆర్టిస్ట్‌లకు వేషాలు ఇవ్వాలంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌గారి ఆధ్వర్యంలో మేం అంతా మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాం. ఇలాగే మరింత ముందుకు వెళ్తాం. నేను రెండు మూడు టర్మ్‌ల నుండి ఫైట్ చేస్తున్నా.. ‘మా’ అసోషియేషన్‌కి పర్మినెంట్ బిల్డింగ్ కట్టుకుని మన పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయేట్టు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. Also Read: ఇక మహిళల తరుపున నా రిక్వెస్ట్ ఏంటంటే... ముందు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు ఫుడ్ పెట్టండి.. ఆ తరువాత బయట ఇండస్ట్రీ వాళ్లను తీసుకురండి అని దర్శకులు నిర్మాతలను కోరుతున్నా. ఇండస్ట్రీలో ఆడవాళ్లు వేషాల కోసం చాలా కష్టపడుతున్నారు.. వారి ఆకలి బాధను అర్ధం చేసుకోండి. మొత్తం ‘మా’లో ఉన్న 800 మందిలో వంద, నూటయాభై మంది మాత్రమే ఆడవాళ్లు ఉన్నారు. వాళ్లకు కూడా అన్నం పెట్టి బట్టలు ఇవ్వలేమా సార్. ముందు మన తెలుగు ఆర్టిస్ట్‌లను ఎంకరేజ్ చేయండి.. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్‌లో కూడా ఎంతో మంది వేషాలు లేవని ఏడుస్తున్నారు. మన అక్క చెల్లెల్ని వేరే చోట చూడొద్దు. మీడియాలో వేరే టైటిల్స్‌తో మమ్మల్ని వేయొద్దు. అలా వేయకూడదు అంటే దర్శకులు, నిర్మాతలు మన తెలుగు వాళ్లకు అవకాశం ఇవ్వండి. కావాలంటే మీ కాళ్లకు దండం పెట్టి అడుగుతున్నా.. ప్లీజ్ మన తెలుగు అమ్మాయిలకు వేషాలు ఇవ్వండి’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు హేమ. See Pics:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/31MLEIq
No comments:
Post a Comment