ప్రముఖ సింగర్, బిగ్ బాస్ 2 రన్నరప్ తల్లికాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె సీమంతం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. తాజాగా ఈ సీమంతానికి సంబంధించి మూడున్నర నిమిషాల నిడివితో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో గర్భవతిగా ఉన్న గీతా మాధురి సిగ్గులొలికిస్తూ భర్త నందుతో కలిసి సందడి చేశారు. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు.. యాంకర్ శ్యామల, తోటి గాయనీమణులు మాళవిక, అంజనా సౌమ్య, తదితరులు కనిపించారు. గీతా మాధురి సీమంత వీడియోను ఇప్పటికే ఆరున్నర లక్షల మందికి పైగా చూడటంతో వైరల్ అవుతోంది. ఇక కెరియర్ పరంగా నందు, గీతా మాధురి బిజీగా ఉండటంతో పిల్లల్ని కనేందుకు కాస్త టైం తీసుకుని ప్లాన్ చేసుకున్నారు. 2014 ఫిబ్రవరి 9న ప్రేమ వివాహం చేసుకున్న ఈ ఇద్దరూ.. పెళ్లైన ఐదేళ్లకు తల్లిదండ్రులు కాబోతున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2FuHMSR
No comments:
Post a Comment