హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బుర్రకథ’. రచయిత డైమండ్ రత్నబాబు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దీపాల ఆర్ట్స్ పతాకంపై హెచ్‌కె శ్రీకాంత్ దీపాల, కిషోర్, ఎంవీ కిరణ్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆది సరసన మిష్తి చక్రవర్తి, నైరా షా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, అభిమన్యు సింగ్, జబర్దస్త్ మహేష్, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, గాయత్రి గుప్తా, జోష్ రవి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ట్రైలర్‌ను లాంచ్ చేయించారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ‘బుర్రకథ’.. టైటిల్‌లోనే సినిమాకు కీలకమైన పాయింట్ దాగి ఉంది. హీరో ఆది ఈ సినిమాలు రెండు విధాలుగా ప్రవర్తిస్తాడు. భౌతికంగా మనిషి ఒక్కడే అయినప్పటికీ అంతర్గతంగా ఆయనలో ఇద్దరు మనుషులుంటారు. అంటే, ఆయన మెదడు రెండు విధాలుగా పనిచేస్తుంది. అందుకే ఇది ‘బుర్రకథ’ అయింది. మరి ఈ ‘బుర్ర’తో డైరెక్టర్ ఎలాంటి ప్రయోగం చేశారో ఇక సినిమాలోనే చూడాలి. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అన్నీ సమపాళ్లలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆది తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కనిపించారు. ఆయన కామెడీ టైమింగ్, ఎమోషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇక కమెడియన్ పృథ్వీ మరోసారి పేరడీ చేశారు. గతంలో బాలయ్యను అనుకరించిన పృథ్వీ.. ఈసారి ప్రభాస్, ఎన్టీఆర్‌లను వాడేశారు. ‘సాహో’ ట్రైలర్‌లో ప్రభాస్ చెప్పిన ‘ఫ్యాన్స్.. డై హార్డ్ ఫ్యాన్స్’ డైలాగ్‌ను ‘బుర్రకథ’ ట్రైలర్ ఆఖరిలో పృథ్వీ చెప్పారు. అలాగే ‘అరవింద సమేత’లో బాలిరెడ్డిని చూసి కోపంగా మొండికత్తిని వీరరాఘవ తన తొడకు అటూ ఇటూ రాస్తారు. అదే సీన్‌ను పృథ్వీ ఇప్పుడు అనుకరించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2Fu1FJH
No comments:
Post a Comment