Sunday 23 June 2019

ఆర్టిస్టులకు ‘డబుల్ బెడ్‌రూం’ ఇళ్లు: ‘మా’ అధ్యక్షుడు నరేష్

సుమారు మూడు నెలల క్రితం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఎన్నికైన నూతన పాలకవర్గం తొలిసారి అధికారికంగా సమావేశమైంది. ‘మా’ జనరల్ బాడీ మీటింగ్ ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ‘మా’ అధ్యక్షుడు నరేష్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓడిన శివాజీ రాజా వర్గం కూడా ఈ మీటింగ్‌లో పాల్గొంది. సమావేశం అనంతరం అధ్యక్షుడు నరేష్ మీడియాతో మాట్లాడారు. ‘మా’ జనరల్ బాడీ మీటింగ్ స్నేహపూర్వకంగా, కోలాహలంగా, విజయవంతంగా సాగిందని నరేష్ చెప్పారు. ‘మొదటి జనరల్‌ బాడీ మీటింగ్‌ చాలా బాగా జరిగింది. ‘మా’కి గతంలో ఏఎన్నార్‌, ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి ముఖ్య సహాదారులుగా ఉన్నారు. ఈసారి కృష్ణంరాజు గారిని ఎన్నుకున్నాం. ఈ సందర్భంగా వారిని సత్కరించుకోవడం ఆనందంగా ఉంది. కొత్త కమిటీ వచ్చిన వారం రోజుల్లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశాం. 30 కాల్స్‌ వచ్చాయి. సలహాల‌ బాక్స్‌కి మంచి స్పందన వచ్చింది. 33 మందికి ఇచ్చే పెన్షన్‌‌ను రూ.6 వేల‌కు చేశాం. మేడే రోజున‌ పెన్షన్‌ డేగా జరుపుకోబోతున్నాం’ అని నరేష్ వెల్లడించారు. ‘మా’ మెంబర్‌ షిప్‌ని కొత్తవాళ్లకి రూ.25 వేల‌కు ఇవ్వాల‌ని నిర్ణయించినట్లు నరేష్ చెప్పారు. రెండేళ్లు రూ. 25 వేల చొప్పున చెల్లిస్తే పూర్తి స్థాయి మెంబర్‌ షిప్‌ వస్తుందన్నారు. అలాగే 90 రోజుల్లో పూర్తి పేమెంట్‌ చెల్లిస్తే పది శాతం రాయితీ ఇవ్వాల‌ని నిర్ణయించినట్లు చెప్పారు. ఇన్సూరెన్స్‌ తీసుకొచ్చామని, మెడిక్లెయిమ్ ద్వారా రూ.29 ల‌క్షలు జమ అయ్యిందని నరేష్ తెలిపారు. దీని ప్రకారం ప్రతి ఆర్టిస్టుకి రూ.3 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపచేస్తున్నామన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, రూ.3 నుంచి రూ.5 ల‌క్షల‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఆర్టిస్టుల‌కి వర్తించేలా చేస్తామని మంత్రి తల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ హామీ ఇచ్చినట్లు నరేష్ వెల్లడించారు. ‘30 మందికి ప్రభుత్వ పెన్షన్స్ ఇవ్వనున్నాం. అలాగే కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప‌థ‌కాలు వ‌ర్తింప చేస్తామ‌ని మంత్రి చెప్పారు. ‘మా’ బిల్డింగ్‌ కోసం చిరంజీవి సపోర్ట్‌ చేస్తానన్నారు. మంత్రి గారు కూడా ల్యాండ్‌ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఫిల్మ్‌ నగర్‌లో ఇవ్వాల‌ని కోరుతున్నాం. భవిష్యత్‌లో హీరోల‌తో కలిసి ప్రజలతో మమేకమై రెండు తెలుగు స్టేట్స్‌లో మంచి కార్యక్రమాలు చేయాల‌నుకుంటున్నాం. గర్వించే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సాధించిన కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు’ అని నరేష్ చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2X0UUtK

No comments:

Post a Comment

'We Attribute Failure To The Director'

'Our analysis of success, like failure, is so reductive and so one dimensional that we don't look at the bigger picture.' from...