Sunday 3 July 2022

Laththi : ప్రమాదంలో గాయపడ్డ విశాల్.. ఫ్యాన్స్ టెన్షన్.. ఆగిన షూటింగ్

హీరో విశాల్ (Vishal) గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘లాఠీ’ (Laththi). ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో విశాల్ గాయ‌ప‌డ్డారు. వెంట‌నే ఆయ‌న్ని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. విశాల్ గాయ‌ప‌డ‌టంతో ఆయ‌న ఫ్యాన్స్‌లో కాస్త టెన్ష‌న్ నెల‌కొంది.డాక్ట‌ర్స్ పెద్ద దెబ్బేమీ కాద‌ని, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటే స‌రిపోతుంద‌ని చెప్పార‌ట‌. దీంతో అభిమానులు, యూనిట్ ఊపిరి పీల్చుకున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/NvkCmTr

No comments:

Post a Comment

'Kashmir Needs A Bal Thackeray'

'Afzal Guru became a victim of Pakistan's conspiracy. He was used as a means, just like all other innocent Kashmiris.' from re...