ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం షూటింగ్‌లతో కళకళలాడుతోంది. ఒక వైపు కొబ్బరి కాయ కొట్టి కొత్తగా షూటింగ్‌ను ప్రారంభించే వారుంటే.. ఇంకొందరు గుమ్మడి కాయ కొట్టేందుకు రెడీగా ఉన్నారు. ఇంకొందరు తమ సినిమాలను ప్రమోషన్ చేసేందుకు ఉబలాట పడుతున్నారు. అలా ఇప్పుడు ముగ్గురు యంగ్ హీరోల చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఇదే కాకుండా బుల్లితెరపై ఎన్టీఆర్ సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యాడు. నేడు ఎవరు మీలో కోటీశ్వరుడు షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఇక లక్ష్య సినిమా నేడు తుది దశకు చేరుకుంది. క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభమైందని చిత్రయూనిట్ ఓ వీడియోను వదిలింది. నేడు హైద్రాబాద్‌లోనే ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభమైందని, అందులో నాగ శౌర్య పాల్గొన్నారని చిత్రయూనిట్ తెలిపింది. ఇక మరో వైపు కూడా రింగులోకి దిగేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను వదిలింది చిత్రయూనిట్. వరుణ్ తేజ్ పదో చిత్రంగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతగా కష్టపడ్డాడో, శరీరాకృతిని మార్చుకునేందుకు ఎంతటి కఠోర శ్రమను పడ్డాడో వీడియో ద్వారా చూపించారు. అలా వరుణ్ తేజ్ బాక్సర్ చిత్రం నేడు తుదిదశకు చేరుకుంది. ఫైనల్ రౌండ్ అంటూ క్లైమాక్స్ షూటింగ్ గురించి అప్డేట్ ఇచ్చారు. ఇక మరో వైపు మాస్ట్రో సినిమా మ్యూజికల్ ఫెస్ట్ అంటూ మరో అప్డేట్ ఇచ్చారు. వచ్చే వారం నుంచి మాస్ట్రో పాటల సందడి ప్రారంభం కానుందని తెలిపారు. అలా మొత్తానికి టాలీవుడ్ మాత్రం ఫుల్ స్వింగ్‌లో ఉంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3k4w0Uc
No comments:
Post a Comment