కేరళ బ్యూటీ అనుపమా పరమేశ్వరణ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే సందడికి కుర్రకారు ఫిదా అవుతుంటారు. చిన్న పిల్లలా మారి చేసే కొంటె చేష్టలు, తన తమ్ముడితో కలిసి చేసే అల్లరికి నెటిజన్లు పడిపోతుంటారు. తెరపై క్యూట్‌గా కనిపించే అనుపమా ఎప్పుడూ కూడా హద్దుల్లోనే ఉంటే.. అందాల ఆరబోతకు మొగ్గు చూపలేదు. అయితే సోషల్ మీడియాలో ఈ మధ్య కాస్త ఘాటుదనాన్ని జోడిస్తోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా అనుపమా తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టేశారు. ఏదైనా అడగండి అంటూ తన ఫాలోవర్లకు ఇన్ స్టాగ్రాంలో ఆఫర్ ఇచ్చేశారు. దీంతో అనుపమా అభిమానులు రెచ్చిపోయారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రశ్నను సంధించారు. కొందరు వ్యక్తిగతమైన విషయాలను టచ్ చేస్తే... ఇంకొందరు మాత్రం కేవలం వృత్తిపరమైన సంగతులు అడిగారు. ఇంకొందరు మాత్రం యథావిథిగా పులిహోర కలిపేందుకు పొగుడుతూ కామెంట్లు చేశారు. ఇక ఇందులో అనుపమకు ప్రేమకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మామూలుగానే మీద ప్రేమకథల గురించి రకరకాల వార్తలు వస్తుంటాయి. ఆ మధ్య ఇండియన్ క్రికెటర్ బుమ్రాతో ప్రేమలో ఉందనే రూమర్లు బాగా వచ్చాయి. వీటిపై ఎవ్వరూ ఇది వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ కొన్ని రోజుల క్రితమే బుమ్రా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నీ జీవితంలో నిజమైన ప్రేమ ఉందా? అని అనుపమను ఓ నెటిజన్ అడిగేశాడు. దానికి సమాధానమిచ్చిన అనుపమ షాకింగ్ విషయాలు చెప్పేసింది. అవును నా జీవితంలో నిజమైన ప్రేమ ఒకప్పుడు ఉండేది.. అంతే కాకుండా నిజమైన బ్రేకప్ కూడా చవిచూశాను అని అసలు విషయం చెప్పేశారు.కానీ అది ఎప్పుడు? ఏ వయసులో? అతను ఎవరు? అనే విషయాలు మాత్రం బయటపెట్టలేదు. అనుపమ ప్రస్తుతం తెలుగులో 18 పేజీలు, రౌడీ బాయ్స్, కార్తికేయ 2 అని చెప్పుకొచ్చారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3emfgV9
No comments:
Post a Comment