టాలీవుడ్ ఇప్పుడు జోరు మీదుంది. దాదాపు రెండు నెలల తరువాత మళ్లీ షూటింగ్‌లు పున: ప్రారంభమయ్యాయి. ఎవరి ప్రాజెక్ట్‌లతో వారు బిజీగా ఉన్నారు. నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇలా అందరూ కూడా తమ తమ ప్రాజెక్ట్‌లను త్వరగా పూర్తి చేసేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మళ్లీ ఎప్పుడు ఎలా ముప్పు వస్తుందో.. మళ్లీ లాక్డౌన్ ఎప్పుడు పెడతారో కూడా తెలియని పరిస్థితి. ఈ క్రమంలో టాలీవుడ్ మొత్తం ఇప్పుడు సెట్స్ మీదే ఉంది. ఇందులో భాగంగా మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ మొత్తం సరదాగా ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. మెల్లిగా మళ్లీ నవ్వులు మొదలు అంటూ ఎఫ్ 3 మూవీ షూటింగ్ ప్రారంభమైనట్టు యూనిట్ తెలిపింది. ఇక అదే నవ్వులను కొనసాగిస్తూ యూనిట్ దూసుకెళ్తోన్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా చిత్ర దర్శకుడు ఓ పోస్ట్ చేశారు. కమెడియన్ అలీ ఎఫ్ 3 మూవీలో ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ కోసం సెట్‌కు వచ్చిన .. వీకెండ్ సందర్భంగా అందరికీ ట్రీట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇంట్లో బిర్యానీ తయారు చేయించుకుని వచ్చి.. సెట్‌లో అందరికీ వడ్డించారట. ఈ మేరకు అనిల్ రావిపూడి పోస్ట్ చేస్తూ.. బిర్యానీ సూపర్ అలీ గారు ఇంట్లో వండించి తీసుకొచ్చి మాకు వడ్డించారు అని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఫోటోలో అలీని చూపిస్తూ అనిల్ రావిపూడి ఇతనే తెచ్చాడు అన్నట్టుగా తెలిపారు. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కాంబోలో వచ్చిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇలా సీక్వెల్‌ను నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున ప్లాన్ చేసేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి ఎఫ్ 3 దిగనుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3i1aFbY
No comments:
Post a Comment