సినిమా.. ఇది ప్రతీ వ్యక్తిని ఆకర్షించే అంశం. ఎంత కష్టంలో ఉన్న సరే తమకు ఇష్టమైన ఓ సినిమా చూస్తే.. ఆ బాధని మొత్తం మర్చిపోతారు. ముఖ్యంగా భారత ప్రజలపై సినిమా ప్రభావం ఎంతో ఉంటుంది. ఏ సినిమా వస్తుందా.. దాన్ని మొదటి రోజు.. మొదటి షో చూస్తేయాలని.. ఎదురు చూసే వాళ్లు కొన్ని కోట్లలో ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలిచిపోతాయి. అలాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసిన మరోసారి చూడాలి అనిపిస్తోంది. అలా ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయిన సినిమా.. ‘’. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ.. యంగ్ రెబెల్ స్టార్ .. వీరిద్దరి కాంబినేషన్.. అంతేకాదు.. విలన్‌గా రానా దగ్గుబాటి.. హీరోయిన్లుగా , తమన్నా ఈ సినిమా ప్రేక్షకులను అలరించడానికి ఇంతకంటే ఏం కావాలి. అందుకే సినిమా గురించి ప్రకటన వచ్చినప్పటి నుంచి సినిమా విడుదల కోసం ప్రేక్షకులు కళ్లలో వొత్తులు వేసుకొని ఎదురుచూశారు. ప్రేక్షకుల ఎదురుచూపులకు ఫలితం మామూలుగా రాలేదు. బాక్స్‌ఆఫీస్ బద్దలైపోయింది. 2015లో విడుదలైన ‘బాహుబలి-ది బిగినింగ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ సక్సెస్ సాధించింది. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘బాహుబలి-ది కన్‌క్ల్యూజన్’ కూడా భారీ విజయం సాధించింది. సినిమా విడుదలై శనివారం (జూలై 10)వ తేదీకి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు చిత్ర యూనిట్‌ని అభినందిస్తూ ట్వీట్ చేశారు, ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ‘ప్రభాస్’ ఈ సినిమాని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా టీమ్ దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మ్యాజిక్ క్రియేట్ చేసింది అని ప్రభాస్ అన్నారు. ఆ సినిమాలో మహాశివలింగం ఎత్తుతున్న దృశ్యాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hSk5q1
No comments:
Post a Comment