Sunday 18 July 2021

Bonalu: వివాదంలో చిక్కుకున్న సింగర్ మంగ్లీ.. మైసమ్మ పాటపై చెలరేగుతున్న దుమారం

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రతి ఏటా బోనాల ఉత్సవాలు చేస్తుంటారు. ఈ వేడుకల్లో తెలంగాణ ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు. అయితే ఈ సీజన్‌లో పాటలు వాడవాడనూ ఉర్రూతలూగిస్తుంటాయి. ప్రతి ఏడాది బోనాల పండగ సమయంలో ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసి చిందులేపిస్తుంటుంది మంగ్లీ. ఇదే బాటలో ఈ ఏడాది రిలీజ్ చేసిన బోనాల స్పెషల్ సాంగ్ కూడా యూబ్యూబ్‌ను షేక్ చేస్తోంది. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం దీనిపై విమర్శలు గుప్పిస్తూ వివాదానికి తెర లేపుతున్నారు. జులై 11న మంగ్లీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌‌లో ఈ ఏడాది బోనాల సాంగ్ రిలీజ్ చేశారు. 'చెట్టు కింద కూసున్నవమ్మా.. సుట్టం లెక్క ఓ మైసమ్మా..' అంటూ సాగే ఈ పాట హైదరాబాద్ బోనాల వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రామస్వామి అందించిన లిరిక్స్‌పై మంగ్లీ ఆడిపాడగా రాకేష్ వెంకటాపురం మ్యూజిక్ అందించారు. ఓ వైపు ఈ సాంగ్ యూట్యూబ్‌లో దుమ్ముదులిపేస్తుండగా.. మరోవైపు ఈ పాటలో వాడిన కొన్ని పదాల పట్ల తెలంగాణకు చెందిన పలువురు నెటిజన్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ దుమారం రేపుతున్నారు. ఇందులో అమ్మవారిని చుట్టంగా, మోతెవరిలా అభివర్ణించడం వివాదానికి కారణమైంది. పాట అంటే భక్తిని పెంచేదిలా ఉండాలని, దీనికి విరుద్ధంగా అమ్మవారిని చుట్టంలా, మోతెవరిలాగా, అక్కరకు రాని చుట్టంలా అభివర్ణించడం సరికాదని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సెలెబ్రిటీ హోదా రాగానే అహంకారం నెత్తికెక్కిందా? అంటూ మంగ్లీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సాంగ్ దేవతని మొక్కినట్టులేదు.. తిడుతున్నట్టుంది అని పేర్కొంటూ వెంటనే లిరిక్స్‌ మార్చాలని, అదే విధంగా మంగ్లీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే పబ్లిసిటీ కోసం ఎంతో మంది హిందూ దేవతలను విమర్శిస్తున్నారని.. ఇప్పుడు గ్రామ దేవతలపై కూడా పడ్డారా? అని ప్రశ్నిస్తూ రచ్చ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hOl8bE

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...