Sunday 18 July 2021

ఆయన ఎవరికీ సెకండ్ ఛాన్స్ ఇవ్వరు.. అది నా జీవితాంతం గుర్తుండిపోతుంది: అనసూయ

అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో తెలియదు.. అది తట్టినప్పుడే తీయాలి.. అవకాశం రాలేదని బాధపడటం కాదు.. అనుకోకుండా అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా ఒక కళే. అలా తనకు దొరికిన ఛాన్స్‌ని కరెక్ట్‌గా ఉపయోగించుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతుంది యాంకర్, నటి . ఓ ప్రముఖ టీవీ షోలో యాంకర్‌గా కెరీర్‌లో బ్రేక్ సంపాదించుకున్న ఈమె.. తెలుగు రాష్ట్రాలో బాగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు కూడా సొంతం చేసుకుంది. ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘కథనం’ లేటెస్ట్‌గా ‘థాంక్యూ బ్రదర్’ వంటి సినిమాల్లో అద్భుత ప్రదర్శన చేసి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం టీవీ షోలతో పాటు పలు సినిమా ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉంది అనసూయ. ఆమె చేస్తున్న సినిమాల్లో ప్రధానంగా చెప్పుకొనే సినిమా ‘’. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. రష్మిక మందన హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాలో అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ‘పుష్ప’ సినిమాలో తన పాత్రపై అనసూయ పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. రంగస్థలం సినిమాలో సుకుమార్‌తో కలిసి పని చేయడం తను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె తెలిపింది. ముఖ్యంగా ఆ సినిమా తర్వాత తనని చాలా మంది రంగమ్మత్తగానే గుర్తుపెట్టుకున్నారని స్పష్టం చేసింది. ఇక పుష్ప సినిమాలో క్యారెక్టర్ విషయానికొస్తే.. ఈ పాత్రని తాను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అని ఎందుకంటే దానికి అంత ప్రాముఖ్యత ఉందని ఆమె స్పష్టం చేసింది. సుకుమార్ తన ఆర్టిస్టులను ఒక లెక్క ప్రకారం చెక్కుతారని.. ఆయన దాదాపు ఎవరికి రెండు అవకాశం ఇవ్వరని.. అలాంటిది తనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను అని పేర్కొంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ueratj

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...