Saturday 17 July 2021

అయ్యే రకుల్ మళ్లీ ట్రోలింగా?.. ఈసారి దారుణంగా బుక్‌ అయినా దిల్లీ ముద్దుగుమ్మ

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ సింగ్. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకుల మనస్సు దోచుకుంది ఈ దిల్లీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో తెలుగు సినిమాల్లో బిజీ అయిపోయింది. తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుకుంది రకుల్ ప్రీత్. కెరీర్ ఆరంభంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్నప్పటికీ.. ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులను రుచి చూసింది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలకు కాస్త గ్యాప్ ఇచ్చి.. బాలీవుడ్ బాటపట్టింది. అయితే రకుల్ ప్రీత్‌కి ఫిట్‌నెస్ అంటే మహా ఇష్టం. అందుకోసం ఏం చేయడానికైనా ఈ భామ సిద్ధంగా ఉంటుంది. గంటల పాటు జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. తన బాడీని స్లిమ్‌గా చేసుకుంది ఈ బ్యూటీ. అయితే గతంలో ఆమెను కాస్త బొద్దుగా ఉండటం చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా మరీ బక్కగా మరిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇదేంటి రకుల్ ఇలా తయారు అయింది అంటూ వాళ్లు ఆశ్చర్యపోయారు. మోతాదుకు మించి జిమ్ చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది అంటూ వాళ్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే ఇది ఇప్పటి విషయం కాదు.. చాలా కాలంగా జరుగుతూనే ఉంది. తాజాగా రకుల్ పోస్ట్ చేసిన ఫోటోషూట్‌పై కూడా ఇలాంటి ట్రోల్‌యే వచ్చాయి. ‘ఆ డ్రెస్ ఏంటీ.. నీ భంగిమలు ఏంటీ.. అసలు నీ అవతారం ఏంటీ’ అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. అయితే తాజాగా ఆమె ధరించిన ఓ డ్రెస్ కారణంగా మరోసారి ట్రోల్స్ ఎదురుకుంది. తెలుపు రంగు నలుపు రంగు చారలు ఉన్న డ్రెస్ ధరించి.. ఆ పిక్స్‌ని షేర్ చేసింది రకుల్. అయితే ఈ డ్రెస్సే ఇప్పుడు ఆమెపై ట్రోల్స్‌కి కారణమైంది. గతంలో ఈ డ్రెస్‌ని బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి కూడా ధరించింది. దీంతో ఆమె స్టైల్‌ని నువ్వు కాపీ చేశావు అంటూ రకుల్‌ని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eojont

No comments:

Post a Comment

'Rahul Has To Be More Ruthless'

'I want to ask the Congress only one question: What is more important than election management in politics?' from rediff Top Inter...