రోజురోజుకూ టెక్నాలజీ పెరుగుతుండటంతో సోషల్ మీడియా మరింత విస్తృతమవుతోంది. దీంతో ఆన్‌లైన్ వేదికలపై వెబ్ సిరీస్‌ల హవా ఎక్కువవుతోంది. ప్రేక్షకులంతా ఆన్‌లైన్ తెరపైనే సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరం దర్శకనిర్మాతలు సైతం వెబ్ సిరీస్‌లు తీసేందుకే మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రేక్షకులను ఆకర్షించడానికై ఈ వెబ్ సిరీస్‌లలో శృంగార సన్నివేశాలు దట్టించడం పలు వివాదాలకు కారణమవుతోంది. వెబ్ కంటెంట్‌కి సెన్సార్ లేకపోవడంతో మసాలా సన్నివేశాలకు పెద్ద పీట వేస్తూ యువతను బుట్టలో వేస్తున్నారు కొందరు దర్శకనిర్మాతలు. తాజాగా ఇదే కోవలో చేరిపోయింది లేటెస్ట్ వెబ్ సిరీస్ 'రాస్ భరి'. లీడ్ రోల్ పోషించిన ఈ మూవీపై వివాదం రాజుకుంది. Also Read: తన చుట్టూ ఉన్న సంస్కృతి సంప్రదాయాల్ని మంటగలిపే వేశ్య తరహా పాత్ర పోషించింది స్వరా భాస్కర్. చుట్టూ ఉన్న ప్రాంతంలోని పురుషులను టార్గెట్ చేస్తూ వారిని ఆకర్షించడానికి ఆమె ప్రయత్నం చేస్తుండటం ఈ వెబ్ సిరీస్‌లో ప్రధానంగా చూపించారు. దీంతో ఇది శృంగార సన్నివేశాల కంటే ప్రమాదకరం అని, లైంగిక ఆలోచనలు కలిగిన యువతి వ్యవహారాన్ని సినిమాగా చిత్రీకరించడం తప్పు అంటూ విమర్శలు వస్తున్నాయి. అసభ్యకరమైన కంటెంట్‌తో రూపొందించే ఇలాంటి వెబ్ సిరీస్‌లను వెంటనే బ్యాన్ చేయాలని, ఇకపై అలాంటి వెబ్ సిరీస్‌లు విడుదల కాకుండా చూడాలని డిమాండ్స్ పెరిగాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Da299J
No comments:
Post a Comment