శరీరానికి యోగా ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలియనిదికాదు, అదేవిధంగా ఈ ఫేస్‌యోగా ముఖంపై కూడా దాని ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. ముఖానికి స్ట్రెచింగ్ ఇవ్వడం ద్వారా, ముఖంపై ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచేందుకు సాయపడుతుంది. క్రమంగా చారలు, ముడతలు తగ్గేందుకు దోహదపడుతూ, వృద్దాప్య ఛాయలు దూరం అవుతాయి. పశ్చిమాది దేశాలలో ఆరోగ్యం మీద శ్రద్ద ఉన్నవారి దృష్ట్యా యోగా స్టూడియోలు, క్లాసులకు ఆదరణ పెరుగుతూ ఉంది. ఈమధ్యకాలంలో మనదేశంలో కూడా ఈ మార్పు కనిపిస్తూ ఉంది. ముంబైకి చెందిన యోగా మాస్టర్ జెనిల్ ధోలాకియా ప్రకారం, “ఒత్తిడి స్థాయిలు ఎక్కువగా ఉన్న కారణంగా, ఆ ప్రభావం ముఖం మీద పడి, తర్వాతి కాలంలో చారలు, ముడతలు, డార్క్ సర్కిల్స్, అకాల వృద్ధాప్యం వంటి సమస్యలకు దారితీస్తుంది. కావున ప్రతిరోజూ ఫేస్ యోగా చేయడం ద్వారా రక్త ప్రసరణ పెరిగి, చర్మ కణాలకు ఆక్సిజన్ అందడం ద్వారా, ప్రకాశవంతమైన, ఆరోగ్యకరమైన ఫేస్ గ్లో సొంతం చేసుకోవచ్చు.” అని తెలిపారు. ప్రతిరోజూ అనుసరించడానికి వీలుగా ఉన్న కొన్ని సాధారణ ఫేస్ యోగా పొజిషన్స్ గురించి తెలుసుకోండి.. - కొద్దిగా తల పైకెత్తి చూస్తూ మీ అరచేతులను ఉపయోగించి, మీ మెడపై మసాజ్ ఇవ్వండి. ఇది మీకు టోన్డ్ నెక్‌లైన్ ఇస్తుంది. - మీ బుగ్గలపై సహజమైన బ్లష్ పొందడం కోసం, మీ నోటిని గరిష్టంగా గాలితో నింపి కుడివైపు, ఎడమవైపుకి బుగ్గలను తిప్పండి. - మీ చెంప ఎముకల చుట్టూ వేలి చివర్లతో మసాజ్ చేయండి.. - మీ నుదుటిపై మీ వేళ్లను ఉంచి, సున్నితంగా ఒత్తిడి కలిగిస్తూ, నుదిటిపై ఎడమ నుండి కుడికి స్లైడ్ చేయండి. ఇది చారలను వదిలించడానికి సాయపడుతుంది. - మీకు వీలైనంతగా మీ నాలుకను బయట ఉంచి, కాసేపు అలాగే ఉంచి మళ్లీ మామూలు స్థితికి రండి.
from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/31LVooG
No comments:
Post a Comment