Tuesday 1 October 2019

Sye Raa Shows :ఆంధ్ర ప్రదేశ్‌లో మెగా అభిమానులకు పండగే.. నాన్ స్టాప్ షోస్

మెగాస్టార్ మొట్టమొదటి సారి కత్తిపట్టి కదనరంగంలోకి దూకాడు మెగాస్టార్. రేనాటి యోధుడిగా సినిమాలో తెల్లవాళ్ళను తెగనరుకుతుంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నీ బాస్‌కి మోకరిల్లుతున్నాయి అని టాక్ నడుస్తుంది. ముందు నుండి ఈ సినిమాకి ఏదైతే బజ్ ఉందో అదే రేంజ్ విజయం దక్కింది అని తెలుస్తుంది. అయితే మెగా ఫ్యాన్స్‌కి మాత్రం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందే ఒక సూపర్ గిఫ్ట్ అందించింది. సినిమాకి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అదనపు షో లకు పర్మిషన్ ఇచ్చింది. Also Read: మామూలుగా అయితే సినిమా నాలుగు ఆటలకు పర్మిషన్ ఉంటుంది. కానీ సైరాకి ఉన్న భారీ క్రేజ్, దానికి తోడు దసరా హాలిడేస్ కలసి రావడంతో ఈ సినిమాకి చాలా ఫ్లోటింగ్ ఉటుంది. అందుకే ఈ సినిమాని రాత్రి 1 గంట నుండి ఉదయం 10 గంటల వరకు ఎక్స్ట్రా షోస్ వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. సినిమా రిలీజ్ అవుతున్న అక్టోబర్ 2నుండి అక్టోబర్ 8 వరకు ఈ అనుమతి అమలులో ఉంటుంది. హెవీ రష్‌ని కంట్రోల్ చెయ్యడానికి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ రాకుండా, బ్లాక్ టికెట్స్‌ని నియంత్రించడానికి ఈ ఎక్స్ట్రా షోలకి అనుమతి ఇచ్చినట్టు ఆ పర్మిషన్ లెటర్‌లో మెన్షన్ చేసారు. ఆ‌ లెటర్‌ని అధికారికంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీకి పంపించారు.అయితే ఆ షో లకి కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్సులు మాత్రం కట్టితీరాలి. Also Read: మామూలుగానే సెకండ్ షో అయ్యేసరికి ఎటూ అర్ధరాత్రి దాటుతుంది. ఇప్పుడు ఇంకో 9 గంటలు అదనపు సమయం దొరికింది కాబట్టి రెండు మూడు షోలు పక్కగా ఉంటాయి.దీంతో ఈ సినిమాని కాస్త ఎక్కువ రేటు పెట్టి కొనుకున్న వాళ్ళు కూడా సెలవులు గడిచేలోపు సేఫ్ అయిపోయి లాభాలు కళ్లజూసే అవకావం దొరికింది. దీంతో ప్రభత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు సినిమాకు వస్తున్న టాక్‌కి ఇది మంచి నిర్ణయమే. రోజుకి 7 నుండి ఎనిమిది షో లు అంటే టికెట్స్ కాస్త ఫ్రీ గా దొరికే వెసులుబాటు కలుగుతుంది. A.P లో బెనిఫిట్ షోస్ కి కూడా పర్మిషన్స్ ఇవ్వడంతో సైరా సందడి ముందు అక్కడే మొదలయింది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా షోలతో అది కంటిన్యూ అవ్వబోతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2pd8v15

No comments:

Post a Comment

'We Attribute Failure To The Director'

'Our analysis of success, like failure, is so reductive and so one dimensional that we don't look at the bigger picture.' from...